సర్ధార్ గబ్బర్ సింగ్” ఇంట్రడక్షన్ ఇలా ఉంటుంది!

మెడలో ఎర్ర తువాలు వేసుకుని బైక్ పై ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేసిన ఫోటోలు ఏ సందర్భంలో తీసిన స్టిల్స్ అన్న విషయం తెలిసిపోయింది. తాజాగా ఇదే డ్రెస్ పై మరో ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ పాటలోని సన్నివేశాలు ఇవి.

రోజులు గడుస్తున్న కొద్ది పవన్ ఫ్యాన్స్ లో ‘సర్ధార్’ సినిమా పట్ల అంచనాలు, టెన్షన్లు పెరిగిపోతున్నాయి. ఓ పక్కన సందడి చేస్తోన్న ఫోటోలు, మరో వైపు భారీ హైప్ నేపధ్యంలో సినిమా కాస్త అటు, ఇటుగా అయితే, ఫలితం ఏమవుతుందో అన్న ఆందోళన పవర్ ఫ్యాన్స్ లో కనపడుతోంది.

ADVERTISEMENT

అయితే ట్రేడ్ వర్గాల టాక్ మేరకు ‘రత్నాపూర్ కా సర్ధార్’ బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టే విధంగా సిద్ధమవుతున్నాడని సమాచారం. పవన్ సరసన కాజల్ అగర్వాల్ కనువిందు చేయనుండగా, దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మార్చి మొదటి వారంలో ప్రేక్షకులను పలకరించనుంది. బాబీ దర్శకత్వ పేరుతో రాబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 8వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే.

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Rejuvenated Pawan Kalyan Back In AP, Finally!

For the last few years, Pawan Kalyan had been suffering from multiple physical conditions, including…

4 minutes ago

తెలంగాణలో మైండ్ గేమ్ పాలటిక్స్.?

తెలంగాణ రాజకీయాలలో రేవంత్ vs కల్వకుంట్ల మధ్య మైండ్ గేమ్ పాలటిక్స్ నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పై బురద జల్లేందుకు…

17 minutes ago