
“మగాడివైతే… ప్రకాశం బ్యారేజీ మీదకు రా… మేం చర్చకు సిద్ధం. మీరు సిద్ధమేనా? తాను మగాడిలా, సొంతంగా నా పేరుతో, సొంత డబ్బుతో భూములు కొన్నానని, జగన్ బతుకంతా బినామీ బతుకేనని, సొంత కార్లను కూడా తనవేనని చెప్పుకునే ధైర్యం జగన్ కు లేదని, బినామీల గురించి మాట్లాడుతున్న జగన్ బినామీ పర్వాన్ని మరోమారు ప్రజల ముందుంచుతామని” పయ్యావుల ప్రకంపనల వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
“జేబు దొంగ చూపు జేబుల మీద… జగన్ చూపులు భూముల మీద… ఉంటాయని, జగన్ దొనకొండ వద్ద భూములు కొనుగోలు చేశారని, అక్కడ రాజధాని రాలేదనే అక్కసుతోనే అధికార పార్టీ నేతలపై ఆయన బురద చల్లుతున్నారని, అసెంబ్లీలో సెప్టెంబర్ 4వ తేదీన రాజధాని ప్రకటన చేస్తే అక్టోబరు – నవంబరు మధ్య తాను భూములు కొనుగోలు చేశానని, తాను రైతు బిడ్డనని, తనకు సంబంధించినంత వరకు భూమి అనేది భావోద్వేగంతో కూడుకున్నదని” ఆవేదనతో చెప్పుకొచ్చారు.
“రాజధాని ప్రాంతంలో తన కొడుకు పేరు మీద భూమి కొనుగోలు చేశానని, అందుకు సంబంధించిన అఫిడవిట్లు ఉన్నాయని, అయితే, జగన్ మాదిరిగా బినామీ బతుకు తాను బతకటం లేదని.. జగన్ కు బెంగళూరులో ఉన్న ప్యాలెస్, సాక్షి పత్రిక, బిల్డింగ్… అవన్నీ బినామీ పేర్ల మీదే ఉన్నాయని” ఓ రేంజ్ లో జగన్ ను టార్గెట్ చేసుకుని పయ్యావుల విమర్శల వర్షం కురిపించారు.
Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…
Following the terrible failure of Vaa Vaathiyaar, Karthi is all set to return with his…