
ఇవాళ తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ అంతా కలిసి ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. ఇకపై నిర్మాతలు ప్రభుత్వ జీవోలు తీసుకొచ్చుకున్నా.. నైజాంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రం టికెట్ రేట్లు పెంచే ప్రసక్తి లేదని తీర్మానించుకున్నారు. ఈమేరకు నిర్మాత శిరీష్, సునీల్ నారంగ్ వంటి ప్రముఖ నిర్మాతలు కూడా తమ అంగీకారం తెలిపారు.
జనాల్ని థియేటర్ కి రప్పించడం కోసం, సింగిల్ స్క్రీన్ లను కాపాడడం కోసం, నిర్మాతలను ఆదుకునేందుకు, ఎగ్జిబిటర్లు అంతరించిపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం అని అందరూ చెప్పినా.. ఈ డిసిషన్ తాలూకు ఎఫెక్ట్ ఇమ్మీడియట్ గా పడేది మాత్రం పెద్ది సినిమా మీదే.
ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఎట్టకేలకు జూన్ 4న విడుదలకు సిద్ధమైన “పెద్ది” సినిమాకి ఈ కొత్త నిర్ణయం తీవ్రమైన నష్టాన్ని కలిగించడం ఖాయం. వెంకట సతీష్ కిలారు కొత్త నిర్మాత, సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు, టికెట్ హైక్ లు మరియు జూన్ 3న బెనిఫిట్ షోల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్ల నిర్ణయం ఆ ఆశల మీద నీళ్లు జల్లినట్లయింది.
సింగిల్ స్క్రీన్స్ లో నో టికెట్ హైక్ రూల్ ని అనుకున్నట్లుగా ఫాలో అయితే గనుక.. “పెద్ది” మాత్రమే కాదు.. మిగతా పెద్ద సినిమాలు కూడా నష్టపోవాల్సిందే. మరి పెద్ది టీమ్ ఈ గండం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…