
రామ్ చరణ్ తాజా చిత్రం “పెద్ది” ఇప్పటికీ పలుమార్లు పోస్ట్ పోన్ అయ్యి, రిలీజ్ డిలే అవ్వడం వల్ల అటు అభిమానులు, ఇటు వేరే సినిమాల నిర్మాతలు చాలా ఇబ్బందిపడ్డారు. జూన్ లో వస్తున్నామని ప్రకటించినప్పటికీ.. ఎప్పుడు అనే క్లారిటీ ఇవ్వలేదు చిత్రబృందం. అయితే.. రీసెంట్ గా “టాక్సిక్” జూన్ రేస్ నుండి తప్పుకోవడం, నాగార్జున నొక్కి మరీ “జూన్ 26” అఖిల్ దే అని గ్యారెంటీ ఇవ్వడంతో “పెద్ది” పరిస్థితి ఏంటా? అనే టెన్షన్ మొదలైంది.
అయితే.. తాజా సమాచారం ప్రకారం టాక్సిక్ రాలేకపోయిన జూన్ 4కి “పెద్ది” వచ్చేందుకు రంగం సిద్ధమవుతోందని దాదాపుగా కన్ఫర్మ్ న్యూస్. ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లకి ఫోన్లు కూడా వెళ్లాయట. ఈమేరకు రేపు మధ్యాహ్నం హైదరాబాద్ లో చిత్రబృందం ఓ ప్రెస్ మీట్ కండక్ట్ చేసి మరీ న్యూస్ ను అఫీషియల్ గా రివీల్ చేయనున్నారు.
ఇకపోతే.. రామ్ చరణ్ కూడా ఇవాళ్టితో (ఏప్రిల్ 30) షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. శృతిహాసన్ తో స్పెషల్ సాంగ్ మరియు కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ అన్నీ నేటితో ముగిసాయి. టీమ్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వైపు దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ & సాంగ్స్ అన్నీ “పెద్ది”కి మంచి హైప్ తీసుకొచ్చాయి. ఇంకో మూడు పాటలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి జాన్వికపూర్ తో రొమాంటిక్ నెంబర్, రెండోది శృతి హాసన్ తో స్పెషల్ సాంగ్ మరియు ఇంకోటి ఎమోషనల్ సాంగ్. రెహమాన్ సారథ్యంలో ఇవన్నీ అద్భుతంగా వచ్చాయని వినికిడి.
సో, బుచ్చిబాబు గనుక ప్రమోషనల్ కంటెంట్ లో చూపిన నవ్యత, నాణ్యత సినిమాలో కూడా చూపించగలిగితే “ఆర్ఆర్ఆర్” తర్వాత రామ్ చరణ్ కి మంచి హిట్టు ఇచ్చిన దర్శకుడిగా మెగా అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాడు. కావున మెగాభిమానులందరూ రేపు సాయంత్రం 4.00 గంటల సమయంలో విడుదలకాబోతున్న “పెద్ది” రిలీజ్ డేట్ పోస్టర్ కోసం వెయిట్ చేయొచ్చు.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…