
అది చూసి అధికారులు సైతం ఆనందాశ్చర్యాలలో మునిగిపోయారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టులో అమర్చిన 48 గేట్లు, వాటిని లేపేందుకు ఒక్కో గేటుకు చెరోవైపు ఒకటి చొప్పున 96 హైడ్రాలిక్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. వాటిలో ఏ ఒక్కటి పనిచేయకపోయినా చాలా ఇబ్బంది ఎదుర్కోవలసి వచ్చేది కానీ అన్నీ సజావుగా పనిచేశాయి.
దేశంలో ఇతర ప్రాజెక్టులలో నేటికీ మోటర్లు-గేరుబాక్సులతో పైకి లేపే గేట్లనే వినియోగిస్తున్నారు. కానీ పోలవరం ప్రాజెక్టులో హైడ్రాలిక్ సిలెండర్లతో పైకిలేచే విదంగా అత్యాధునికమైన గేట్లను అమర్చారు.
అవసరమైతే దేనికి అది లేదా కొన్ని గేట్లు లేదా అన్నీ ఒకేసారి తెరుచుకొనే విధంగా వాటిని కంప్యూటరుతో అనుసంధానించారు. 48 గేట్లు అమర్చిన తరువాత వాటిని చాలాసార్లు విజయవంతంగా పరీక్షించారు కూడా. కానీ ఇప్పుడు ప్రాజెక్టు నిండా వరద నీరు నిండి ఉన్నప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకొంటూ నీటిని నిలిపి ఉంచడమే కాకుండా, అలవోకగా 48 గేట్లు ఒకేసారి తెరుచుకొని 15 లక్షల క్యూసెక్కుల నీళ్ళు దిగువన కాలువలోకి విడుదల చేశాయి.
మన దేశంలో 15 లక్షల క్యూసెక్కుల నీళ్ళను ఒకేసారి విడుదల చేయగల ప్రాజెక్ట్ ఇదే. ఆ అద్భుతం ఈరోజు ఆవిష్కృతమైంది.
అయితే జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కానీ వైసీపీ మంత్రులు, ఎమ్మేల్యేలు ఎవరూ ఈ అద్భుతం గురించి మాట్లాడకపోవడం గమనార్హం.
బహుశః ఈ క్రెడిట్ మాజీ సిఎం చంద్రబాబు నాయుడుకి, ఆనాటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమకు వెళ్ళిపోతుందని భయంవల్ల కావచ్చు. ఎందుకంటే పోలవరంలో డయాఫ్రాం వాల్వ్ పాడయినప్పుడు చంద్రబాబు నాయుడు, దేవేనేని ఉమా తొందరపాటు నిర్ణయాలే కారణమని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పదేపదే విమర్శించడం అందరూ విన్నారు.
పోలవరంలో జరిగిన పొరపాట్లు లేదా లోపాలకు చంద్రబాబు నాయుడు, దేవినేని ఉమాలను బాధ్యులను చేసి నిందించినందున, చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటు చేసిన 48 హైడ్రాలిక్ గేట్లు అద్భుతంగా పనిచేశాయని, ఇది మా ప్రభుత్వం గొప్పదనమే అని చెప్పుకోలేరు. ఈ ఇంజనీరింగ్ అద్భుతానికి కూడా వారినే బాధ్యులని చేసి వారి పేర్లే చెప్పాల్సి ఉంటుంది.
కనుక ఇంత గొప్ప విషయాన్ని అంబటి రాంబాబు చూడనట్లు, తెలియనట్లు మౌనంగా ఉండిపోవలసి వచ్చిందనుకోవచ్చు.
కనుక జగన్ సర్కార్ దీనిని ఓ గునపాఠంగా స్వీకరించి ఇకనైనా సాంకేతిక సమస్యలకు కూడా గత ప్రభుత్వాలను నిందించకుండా ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దుకొంటూ వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేయగలిగితే ఆ క్రెడిట్ వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది. అని గ్రహిస్తే మంచిది.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…