
గోరంట్ల షోలో కనిపించిన ఓ మహిళ కూడా కనిపించింది. కనుక ఆమె పరువు కూడా సోషల్ మీడియాలో పడింది. దాంతో ఆమె అనంతపురంలోని గాండ్లపెంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. “ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. కానీ నా ఫోటో, పేరు జోడించి గోరంట్ల షోలో ఉన్నది నేనే అంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియోను తొలుత మాలతీ రెడ్డి అనే మహిళ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత దానిని వేణు, చందు, రమణ నవీన్ కుమార్ అనే నలుగురు వ్యక్తులు ఫార్వర్డ్ చేశారు. నా వ్యక్తిగత జీవితానికి మచ్చ తెస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని” ఆమె పోలీసులను కోరారు.
ఆమె పిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసుకొన్నామని గాండ్లపెంట సీఐ శంకర్ నాయక్ చెప్పారు. దర్యాప్తులో ఆమె ఆరోపణలు నిజమని తేలితే తప్పకుండా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొంటామని చెప్పారు.
ఎంపీ గోరంట్ల మాధవ్ షో జరిగి నాలుగు రోజులవుతున్నా ఇంత వరకు జగన్ ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తుండటంపై మంత్రి ఆర్కె. రోజా స్పందిస్తూ “ఎంపీ గోరంట్ల తాను ఎటువంటి తప్పు చేయలేదని చెపుతున్నారు. స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేసారు. దీనిపై పోలీసులు విచారణ జరిపి నిజానిజాలు నిర్ధారించిన తర్వాత ఒకవేళ గోరంట్ల తప్పు చేసినట్లు తేలితే సిఎం జగన్మోహన్ రెడ్డి తగిన చర్యలు తీసుకొంటారు,” అని చెప్పారు.
The YSR Congress Party (YSRCP) is facing a major challenge in Andhra Pradesh’s Local Body…
Misha Narang gives casual dressing a stylish little shakeup in this breezy photoshoot. An oversized…