
ఈ సందర్భంగా ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ, “గత 14 నెలలుగా రవాణా భత్యం, ఆరు డీఏలు ప్రభుత్వం చెల్లించవలసి ఉంది. అలాగే మూడు సరండర్ లీవ్స్, అదనపు సరండర్ లీవుల బకాయిలు ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు. కానీ బకాయిలు చెల్లించినట్లు ఆడిట్లో చూపించి వాటిపై పన్ను కూడా వసూలు చేసింది. ఇది నా ఒక్కడి సమస్యే కాదు. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులందరూ ఇబ్బంది పడుతున్నారు. కనుక సిఎం జగన్మోహన్ రెడ్డిగారు మా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను,” అని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అయితే పోలీస్ శాఖలో క్రమశిక్షణ చర్యలకు భయపడి అందరూ మౌనంగా పనిచేసుకుపోతున్నారు. ఇప్పుడైనా కానిస్టేబుల్ ప్రకాష్ ధైర్యం చేసి నిరసన తెలిపారు కనుక ఈ విషయం బయటకు వచ్చింది లేకుంటే ఎవరికీ తెలిసి ఉండేదే కాదు కదా?
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…