Telugu

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌.. క్లైమాక్స్‌ సీన్

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో వ్యవహారం ముగింపుకి చేరుకొన్నట్లే కనిపిస్తోంది. ఈ వ్యవహారంపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఈరోజు చెప్పింది వింటే వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని అటకెక్కించబోతున్నట్లు స్పష్టం అవుతోంది.

“ఈ నెల 4వ తేదీన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అభిమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాం. ఆగస్ట్ 3వ తేదీ రాత్రి 3 గంటలకు ఆ వీడియో తొలిసారిగా సోషల్ మీడియాలో అప్‌లోడ్‌ అయినట్లు గుర్తించాము. దానిని యూకేకి చెందిన ఓ ఫోన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేసినట్లు గుర్తించాము. ఆ తర్వాత దానిని ఐ-టిడిపి వాట్సప్ గ్రూపులో ఫార్వర్డ్ చేసింది. అదే మళ్ళీ సోషల్ మీడియాలోకి అప్‌లోడ్‌ చేసినట్లు గుర్తించాము. ఆ తర్వాత ఆ వీడియో చాలాసార్లు చాలా గ్రూపులకి ఫార్వర్డ్ చేయబడింది.

ADVERTISEMENT

అయితే ఆ వీడియోలేవీ ఒరిజినల్ కావు. కనుక ఒరిజినల్ దొరికితే తప్ప అది నిజమైనదా లేక మార్ఫింగ్ చేయబడినదా?అని చెప్పలేము. కానీ ఆ వీడియోను యూకేలో ఎడిటింగ్ చేసి ఉండవచ్చని గ్రహించాము. కనుక ముందుగా యూకేకి చెందిన ఓ ఫోన్‌ ఎవరిది? దానికి ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది?అనే విషయాలు తెలుసుకోవలసి ఉంది. దానిపై దర్యాప్తు జరుపుతున్నాం.

ఈ వీడియో వ్యవహారంపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ కానీ మరెవరూ గానీ మాకు ఫిర్యాదు చేయలేదు. ఒకవేళ ఎవరిదగ్గరైనా ఆ ఒరిజినల్ వీడియో ఉన్నట్లయితే మాకు అందజేస్తే మేము ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి, ఆ నివేదిక ఆదారంగా బాధ్యులపై చర్యలు తీసుకొంటాము,” అని చెప్పారు.

ఇంతకాలం మంత్రులు, సజ్జల రామకృష్ణారెడ్డి ఫోరెన్సిక్ నివేదికలో ఎంపీ తప్పు చేసినట్లు తేలితే చర్యలు తీసుకొంటామని చెప్పారు. కానీ ఎస్పీ ఫకీరప్ప అసలు ఇంతవరకు ఆ వీడియో తమ చేతికే అందనేలేదని, అది ఎక్కడ ఉందో, ఎవరు తీశారో కూడా తెలీదని, ఎవరి దగ్గరైనా ఉంటే ఆ వీడియో ఉంటే తెచ్చివ్వాలని చెప్పడం చూస్తే ఇన్నిరోజులుగా వైసీపీ నేతలు చెపుతున్నవన్నీ సమయం సంపాదించుకోవడానికి చెపుతున్న వట్టి కబుర్లే అని స్పష్టమవుతోంది. ఆ ఒరిజినల్ వీడియో దొరకలేదు కనుక ఈ కధ ఇక్కడితో సమాప్తం అయిపోయినట్లే. సూపర్ హిట్ అయిన గోరంట్ల షోకు తెర పడినట్లే. వారం రోజులలోపే ఈ కేసును అటకెక్కించేసినట్లే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Shocking: YSRCP Struggling for Candidates in Kadapa

The YSR Congress Party (YSRCP) is facing a major challenge in Andhra Pradesh’s Local Body…

10 minutes ago

Pics: Misha Brings A Bold Twist To Casual Chic!!!

Misha Narang gives casual dressing a stylish little shakeup in this breezy photoshoot. An oversized…

1 hour ago