“పోలీసోడు” ట్రైలర్ – తెలుగులోనూ అంచనాలు పెంచింది!

Policeodu Official Trailer talk, Vijay,amy jockson, samanthaసినిమాకు కావాల్సింది మంచి టైటిల్ డిజైన్ కాదు, మంచి కధ అని తమిళ చిత్ర పరిశ్రమ ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంటుంది. ఇటీవల తెలుగులో విడుదలైన “పోలీసోడు” ఫస్ట్ లుక్ పోస్టర్ పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. మూడు దశాబ్దాల క్రితం పోస్టర్ లా ఉందని, ఈ టైటిల్ డిజైన్ ఇలా ఉందేంటి అంటూ విమర్శలు చేసిన వారికి ధియేటిరికల్ ట్రైలర్ సమాధానం చెప్పినట్లయ్యింది.

తమిళంలో అంతకు ముందు విడుదల చేసిన ట్రైలర్ నే తెలుగులోనూ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆసక్తి గొలిపే అంశాలతో పక్కా కమర్షియల్ మేళవింపులతో విజయ్ “పోలీసోడు” సిద్ధమైనట్లుగా కనపడుతోంది. సాధారణంగా ట్రైలర్ విడుదలైన తర్వాత సినిమాపై మార్కెట్ వర్గాలు ఒక అవగాహనకు వచ్చేస్తాయి. ‘పోలీసోడు’ విషయంలో ఇది పాజిటివ్ సంకేతాలను ఇస్తోంది. తెలుగులో దిల్ రాజు పంపిణీ చేస్తుండడంతో ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో ‘పోలీసోడు’పై ఏర్పడిన అభిప్రాయాన్ని ట్రైలర్ మరింత బలపరిచింది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories