Telugu

నెమ్మదిగా ఉన్నా నిజాయితీగా సాగిన పొన్నియిన్ సెల్వన్

చరిత్రలో ఉండిపోయిన సామ్రాజ్యాల గాథలను తవ్వాలే కానీ ఎన్నో అద్భుతమైన కథలు దాగుంటాయి. సరిగ్గా ఒడిసి పట్టుకుంటే బంగారమే. ఇది మణిరత్నంకు బాగా తెలుసు. పొన్నియిన్ సెల్వన్ ని తెరకెక్కించాలని దశాబ్దాలుగా ఎదురు చూసి చివరికి బాహుబలి చూశాక దాన్నుంచి స్ఫూర్తి చెంది తానూ తీయాలనే సంకల్పంతో కల్కి రాసిన నవలను సినిమాకు అనుగుణంగా మార్చుకున్నారు. ఇదంతా రెండు మూడు వేదికల మీద ఆయనే స్వయంగా చెప్పారు. రెండు భాగాలు తీయాలనే ధైర్యం కూడా జక్కన్న వల్లే వచ్చిందని ఎలాంటి భేషజం లేకుండా చెప్పారు. మొదటి భాగం తెలుగులో రికార్డులు సృష్టించలేకపోయినా జనం దృష్టిలో పడింది.

ఫస్ట్ పార్ట్ ఎక్కడ ముగించారో సీక్వెల్ అక్కడే మొదలు పెట్టారు. శత్రువుల కుట్ర వల్ల సముద్రంలో పడిపోయిన అరుళ్ మొళి(జయం రవి) ప్రాణాలతో బయటపడతాడు. చోళ వంశం మీద ప్రతీకారాన్ని శపథం చేసిన నందిని(ఐశ్వర్య రాయ్)ఇతనితో పాటు కరికలాన్ (విక్రమ్) ని అంతం చేయాలని వీర్యపాండ్య వంశస్థులతో కలిసి పన్నాగం వేస్తుంది. ఇది తెలిసిన వల్లవరాయ(కార్తీ) అన్నదమ్ములకు ఈ విషయం చేరవేస్తాడు. నందినిని కలిసేందుకు బయలుదేరిన కరికాలన్, రాజ్యానికి తిరిగి వచ్చిన అరుళ్ మొళి రాక తర్వాత ఊహించని సంఘటనలు జరుగుతాయి. అసలు కథంతా ఈ పరిణామాల మధ్య తర్వాత చాలా జరుగుతుంది. పీఎస్ 2లో కీలకం ఇదే.

ADVERTISEMENT

జానర్ ఏది తీసుకున్నా మణిరత్నం స్టయిలే నెమ్మదిగా ఉంటుంది. ఇప్పుడే కాదు గీతాంజలి, నాయకుడు, దళపతి లాంటివి ఏవి తీసుకున్నా డిటైలింగ్ కి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. ఇక ఎపిక్ లాంటి పొన్నియిన్ సెల్వన్ ని తీస్తున్నప్పుడు ఎంత జాగ్రత్త వహిస్తారో వేరే చెప్పాలా. పీఎస్ 2లో అన్ని ఎమోషన్లు ఉన్నాయి. అయితే అవి స్లో మోషన్ లో రిజిస్టర్ అవుతాయి. పాత్రలకు మనం కనెక్ట్ అయితేనే వాటిని పూర్తిగా ఆస్వాదించగలం. ప్రతి సీన్ ఒక పెయింటింగ్ ని తలపిస్తుంది. అయితే కొన్ని అర్థం అయినట్టు ఉంటాయి. కొన్ని ఇంకెంత సేపు అనిపిస్తాయి. ఆయనలో భావుకత్వం పెట్టిన పరీక్ష ఇది. భావోద్వేగాలకు పెద్ద పీఠ వేసినప్పుడు వచ్చే చిక్కే ఇది.

సగటు ఆడియన్స్ కి ఈ స్లో పేస్ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ముందే సిద్ధమై టికెట్ కొన్నవాళ్ళు నిరాశపడకపోవచ్చు. ఈ పొన్నియిన్ సెల్వన్ రెండు విభాగాల్లోనూ పడుతుంది. అందుకే తమిళంలో అయిదు వందల కోట్లు వసూలు చేసిన పొన్నియిన్ సెల్వన్ 1 ఇక్కడ పది కోట్లకే కిందా మీద పడింది. కానీ ఈ రెండో భాగంకి అంత రిస్క్ అనిపించదు. నిడివి ఎక్కువగా ఉండి కొన్ని ఎపిసోడ్లు అసంతృప్తిగా అనిపించినా మణిరత్నం పనితనం నూటికి నూరు శాతం కాకపోయినా అరవైకి పైగా మార్కులతో గట్టెక్కిపోతుంది. విజువల్ గ్రాండియర్స్ ని తెరమీద చూసేందుకు బాగా అలవాటు పడుతున్న కొత్త జనరేషన్ కి ఇలాంటి ప్రయత్నాలు నచ్చితే మరికొన్ని వస్తాయి

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pics: Sanchi Serves Sultry Chic In Black Saree Look!

Sanchi Rai gives the saree a moodier, more playful makeover in this warm, intimate photoshoot.…

10 minutes ago

Ranabaali Joins The Paradise: The ‘Possession’ Formula

Vijay Deverakonda's Ranabaali, directed by Rahul Sankrityan, was released in theatres yesterday (October 16th) and…

41 minutes ago