
ఈ మొత్తం ఎపిసోడ్ లో కొడుకుని ఎలాగైనా హీరోగా నిలబెట్టాలన్న తండ్రి బెల్లంకొండ సురేష్ తాపత్రయం కనపడుతోంది. ఒక నిర్మాతగా తన కొడుకు సినిమాకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి బెల్లంకొండ సురేష్ వెనుకాడడం లేదని, ఇంకా చెప్పాలంటే మార్కెట్ లో క్రేజ్ ఉన్న హీరోయిన్లను మాత్రమే శ్రీనివాస్ కు జతగా ఎంపిక చేస్తున్నారని చెప్పాలి. తాజాగా విడుదలైన ‘డీజే’తో పూజా ఒక్కసారిగా టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది పూజా.
దీంతో హెగ్డే అందచందాలను తమ తదుపరి సినిమాకు వినియోగించుకోబోతున్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే… ‘అల్లుడు శీను’లో సమంత ప్రదర్శించిన గ్లామర్, అంతకుముందు వరకు లేదనే చెప్పాలి. అలాగే తొలిసారిగా కెరీర్ లో తమన్నా ఐటెం సాంగ్ చేసింది కూడా ఈ అల్లుడు శీను పక్కనే. ముద్దుగుమ్మలు అడిగినంత ఇవ్వడానికి, బెల్లంకొండ సురేష్ ఏ మాత్రం వెనుకాడకపోవడమే ఇందుకు కారణంగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.
‘లక్ష్యం’ ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాను ఫైనల్ చేసినట్లు సమాచారం. గత కొన్ని రోజులుగా ఈ ముద్దుగుమ్మతో జరుగుతున్న ఎట్టకేలకు సఫలీకృతం అయ్యాయని, ఈ ముద్దుగుమ్మకు కూడా భారీ పారితోషికం దక్కనుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చిత్ర నిర్మాణ సంస్థ నుండి రానుంది.
The Irumudi team had plenty to celebrate as the film’s extraordinary theatrical run continues, with the movie…
ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే…