Telugu

పూజా హెగ్డే మీద దుష్ప్రచారం… ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారా?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇటీవల తన రాధే శ్యామ్ యొక్క తుది షెడ్యూల్ను ప్రారంభించాడు. అయితే కోవిడ్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది. అయితే కొంత మంది షూట్ కు పూజా హెగ్డే కో-ఆపరేట్ చెయ్యడం లేదని అందుకే సినిమా షూటింగ్ ఆగిపోయిందని ప్రచారం చెయ్యడం మొదలుపెట్టారు.

అయితే ఇందులో నిజం లేదని తేలింది… ప్రభాస్ వ్యక్తిగత మేకప్ మ్యాన్ కోవిడ్ పాజిటివ్ గా తేలడం వల్లే షెడ్యూల్ ఆగిపోయిందట. పూజా ఎదుగుదల ను ఓర్వలేని కొంతమందినే ఈ ప్రచారానికి పూనుకుందని అంటున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు మొత్తంగా రాధే శ్యామ్ టీమ్ ఐసొలేషన్ కు వెళ్లాల్సి వచ్చింది.

ADVERTISEMENT

ఈ చిత్రం జూలై 30 విడుదల కోసం ప్రకటించబడింది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితి కారణంగా అది విడుదల అవుతుందో లేదో చూడాలి. రాధే శ్యామ్ దక్షిణాది వెర్షన్లకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్‌లో వేర్వేరు సంగీత దర్శకులు ఉన్నారు. ఈ సినిమాకు తెలుగు దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు.

రాధాకృష్ణ ఇంతకు ముందు ఒకే ఒక తెలుగు చిత్రం ‘జిల్’ కు దర్శకత్వం వహించారు. రిలీజ్ డేట్ మీద క్లారిటీ వచ్చాకనే సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. దాదాపుగా వారం రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండటంతో తొందరపడాల్సిన అవసరం లేదని చిత్రబృందం పాటిస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Blockbuster And Disaster, But Hero Forgotten?

Kannada star Yash achieved something in the Telugu market that not many of his Kannada…

1 hour ago

BB Telugu: Naresh Gets Exposed For First Time

The heat around the seventh-week nominations in the Bigg Boss house shows no signs of…

2 hours ago