Telugu

నేను ఇంకా చచ్చిపోలేదు అని చెప్పుకోవాల్సి రావడమేంటి?

సోషల్ మీడియా విప్లవం మాట ఎలా ఉన్నా? ఒక్కోసారి వ్యాపించే వదంతులకు అర్ధం పర్ధం ఉండటం లేదు. అసలు నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నాలే ఎవరూ చెయ్యకుండా పుకార్లు వ్యాపింపచేస్తున్నారు. ఇప్పుడు అటువంటి పనులు వల్ల ఇబ్బంది పడ్డారు పోసాని కృష్ణమురళి. ఆయన తన ఆరోగ్యంపై వస్తున్న ప్రచారంపై ఆయన స్పందించారు. తాను చనిపోయేంత అస్వస్థతకు గురి కాలేదని ప్ర పోసాని కృష్ణమురళీ చెప్పుకోవాల్సి రావడం దురదృష్టకరం.

ADVERTISEMENT

తనకు అనారోగ్యం వచ్చిన మాట నిజమేనని, కాని చనిపోయేంత కాదని ఆయన అన్నారు. యశోదాలో తాను చికిత్స తీసుకున్నానని,ఇప్పుడు బాగానే ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ విషయమై ఆయన ఒక వీడియో కూడా విడుదల చేశారు. సోషల్ మీడియాలో తన అనారోగ్యంపై వదంతులు వచ్చినట్లు తెలిసిందని, అందుకే ఈ విషయం చెబుతున్నానని అన్నారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందినారందరికి ధన్యవాదాలు అని ఆయన చెప్పారు. పోసాని ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ కు విస్తృతంగా సపోర్టు చేసారు.

గత రెండు మూడు సంవత్సరాల నుండి ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడుని తీవ్రంగా విమర్శించేవారు. టీడీపీ అంటే కమ్మ పార్టీ అనే విషయం ఎస్టాబ్లిష్ చెయ్యడంలో పోసాని కీలక పాత్ర పోషించారు. ఎన్నికల ఫలితాలు రాకముందే ఆయన అస్వస్థతకు గురై హాస్పిటల్ లో చేరారు. మరోవైపు పోసాని చేసిన సాయానికి జగన్ ఆయనకు ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇస్తారని సమాచారం. ఇప్పటికే మరో సినీ నటుడు పృథ్వికి టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీబీసీకి చైర్మన్ ను చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

భోగాపురం విమానాశ్రయంలో మరో ప్రారంభోత్సవం!

భోగాపురం విమానాశ్రయానికి ఎప్పుడో ప్రారంభోత్సవం జరిగింది కదా? మళ్ళీ కొత్తగా ఈ ప్రారంభోత్సవం ఏమిటి? అనే సందేహం కలుగవచ్చు. భోగాపురం…

34 minutes ago

AP MPTC, ZPTC Polls: 46,045 MPTC Nominations Valid

The Andhra Pradesh MPTC and ZPTC election process has entered the next stage, with reports…

1 hour ago