
జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్న పార్టీలు హోరాహోరీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. ఆ నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రాజకీయ పార్టీలు చేస్తోన్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి పెట్టినప్పటికీ ఆయా పార్టీలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. డబ్బు రాజకీయాన్ని మించి అమ్మ సెంటిమెంట్ కోసం శవపేటికను రంగంలోకి దించారు నేతలు.
అమ్మ భౌతికకాయం బొమ్మ, శవపేటికతో ప్రచారం చేస్తూ… అమ్మ మరణానికి శశికళ, ఆమె కుటుంబీకులే కారణమని పరోక్షంగా పన్నీరు సెల్వం వర్గీయులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే శశికళ వర్గీయులపై అనేక అనుమానాలు నెలకొన్న నేపధ్యంలో, ఇదే అదునుగా ఓటర్లను తమ వైపుకి తిప్పుకోవడానికి పన్నీర్ వర్గం జీపుపై అమ్మ భౌతికకాయాన్ని పోలిన బొమ్మను శవపేటికలో ఉంచి ప్రచారం నిర్వహించింది. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నా, పన్నీరు వర్గం మాత్రం ఇదే రకమైన ప్రచారంతో దూసుకెళ్తోంది.
Kayadu Lohar has explained why she wrote “I look like a potato” after sharing her…
మంత్రి కొండా సురేఖ భయపడినట్లే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఈరోజు ఉదయం ఆమెకు ఫోన్ వచ్చింది. ఈరోజు సాయంత్రం…