
బంధురీకం ఉండడంతో పొట్టి రమేష్ కు తన కూతురినిచ్చి వివాహం చేసామని, తమ దగ్గర డబ్బులు లేకపోయినా ఉన్నంతలో పెళ్లిని ఘనంగా చేసామని, తమకు ఏమీ లేదన్న విషయం వారికి కూడా తెలిసే ఒప్పుకున్నారని, పెళ్ళయిన మూడు నెలల వరకు అంతా బాగానే ఉందని, అయితే ఆ తర్వాత తమ కూతురు చెప్పే విషయాలు తెలుసుకుని ఆశ్చర్యానికి గురయ్యామని, కనీసం సోఫాలో కూర్చున్నా… నీ ముఖానికి సోఫా అవసరమా? ఏదో ఒక మూల కూర్చో… అంటూ అత్తమామ, ఆడపడచు, ఆమె భర్త వేధింపులకు గురి చేసేవారని, తమతో ఫోన్ మాట్లాడాలంటే అందరూ నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రుల సమయంలో మాట్లేడదని త్రిపురాంభిక తల్లి పుష్పలత వివరించారు.
ఈ విషయాలు తెలుసుకుని ఒకటి, రెండు సార్లు వారింటికి వెళితే, బాగా చూసుకుంటున్నామని చెప్పేవారని, మేం వచ్చేసిన తర్వాత ‘మీ అమ్మనాన్నలకు చెప్తావా’ అంటూ మరింతగా వేధించేవారని, ఇంత జరిగినా ఏనాడూ తాము గానీ, తమ కుమార్తె గానీ వారికి ఎదురు చెప్పింది లేదని, ఈ విషయాలు భర్త పొట్టి రమేష్ కు చెప్తే… నేను ఏదైనా అంటే బాధపడాలి గానీ, వారి మాటలు పట్టించుకోవద్దని అనే వారని తమ కూతురు చెప్పేదని పుష్పలత మీడియా వర్గాలతో తమ అనుభూతులు పంచుకున్నారు.
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…