
వారు ఈ చిత్రం యొక్క ప్రీ-లుక్ పోస్టర్ను కూడా విడుదల చేశారు మరియు ఇందులో రాముడు, హనుమంతుడు మరియు రావణాసురుడని పోలిన చిత్రాలు ఉన్నాయి. అయితే, రామాయణం ఆధారంగా సినిమా తీసినట్లు మేకర్స్ ప్రకటించలేదు. ప్రభాస్ తరువాతి సినిమా దర్శకత్వం వహిస్తున్న నాగ్ అశ్విన్ మాత్రం ప్రభాస్ రాముడిగా నటిస్తాడని ప్రకటించేశాడు.
దీనితో రాముడి పాత్రకు ప్రభాస్ నప్పుతాడా అని చర్చ మొదలయ్యింది. అయితే రామాయణంలోని ఏ భాగంగా సినిమా తీస్తారు అనేది చూడాలి. క్షత్రియ వీరుడు రాముడిగా అయితే ప్రభాస్ బానే నప్పుతాడు. అయితే అడవుల్లోకి వెళ్లే సాత్విక రాముడి పాత్రలో అనుమానమే. చూడాలి ఎలా ఉండబోతుంది అనేది.
ఈ చిత్రాన్ని 2022 లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ విలన్‌గా నటించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరోవైపు, కరోనా కేసులు కాస్త తగ్గుతే తన రాధే శ్యామ్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించవచ్చని ప్రభాస్ ఎదురు చూస్తున్నాడు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించాయనే చెప్పాలి. తెలంగాణ…
South India has this strong hero worship culture, be it cinema or politics. The kind…