
‘బాహుబలి’ రెండు పార్ట్స్ కు మధ్యలో ఏదొక సినిమా చేసుకునే సౌలభ్యాన్ని రాజమౌళి కల్పించినప్పటికీ, చేయకుండా ‘బాహుబలి 2’ పైనే దృష్టి కేంద్రీకరించిన ప్రభాస్, ఇక నుండి మాత్రం అభిమానుల ఆకలి తీర్చేలా సినిమాలు చేస్తానని చెప్పాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన రెండు ముక్కలే అయినా… అందులో ఫ్యాన్స్ కు కావాల్సిన సమాచారాన్ని అందించడంలో సక్సెస్ సాధించాడు ప్రభాస్.
ఇక నుండి సంవత్సరానికి కనీసం రెండు సినిమాలైన చేయడానికి తన వంతు ప్రయత్నం తానూ చేస్తానని చెప్పి, ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసాడు. అందుకు తగిన విధంగానే తన తదుపరి సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకు వెళ్ళబోతున్నాడు ప్రభాస్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రూపొందించగా, దీనిని ‘బాహుబలి 2’తో పాటు ధియేటర్లలో ప్రదర్శించబోతున్నారు.
Allari Naresh knows exactly what he wants from the audience this time that's laughter, not…
There is some fresh buzz around Chiranjeevi and Bobby Kolli’s Kaaka. According to industry gossip,…