
సోషల్ మీడియాలో సాయంత్రం నుంచే దీని మీద కౌంట్ డౌన్ మొదలయ్యింది. కొందరు ఏకంగా థియేటర్లో స్క్రీన్ చేసి ఉంటే ఎంజాయ్ చేసేవాళ్ళమని అన్న వాళ్ళు లేకపోలేదు. ప్రభాస్ ప్రోమోలు విపరీతమైన ఆసక్తి రేపడం, అందులోనూ బాలయ్య ఎనర్జీ ఎవరూ ఇప్పటిదాకా అడిగే సాహసం చేయని ప్రశ్నలు టచ్ చేయడం సాధారణ ప్రేక్షకుల్లోనూ ఎగ్జ్ జైట్ మెంట్ కు కారణమయ్యింది. అలెర్ట్ అయిన ఆహా వెంటనే రంగంలోకి దిగింది కాబట్టి ఏ క్షణంలో అయినా పరిస్థితి మాములుగా మారి అందరూ చూసేయొచ్చు.
ఇక్కడే కాదు యుఎస్ తదితర దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని నెటిజెన్ల నుంచి వస్తున్న రిపోర్ట్. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులకు లేదా స్టార్ హీరో నటించిన వరల్డ్ ప్రీమియర్ కు తప్ప ఇలా జరగడం అరుదు. అందులోనూ ఇప్పుడిప్పుడే సర్వర్ కెపాసిటీ మీద దృష్టి పెట్టి 4కెకు అప్ గ్రేడ్ అయిన ఆహాకు ఇలాంటి ఇబ్బందులు మున్ముందు సమస్యలు రాకుండా ఉపయోగపడతాయి. దీనికే ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు ముందస్తు ప్రిపరేషన్ చాలా అవసరం అయ్యేలా ఉంది. కేవలం షూటింగ్ కే మీడియాలో ఓ రేంజ్ రచ్చ జరిగింది.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…