
జార్జియాలోని పచ్చని లొకేషన్, 80ల కాలం నాటి ట్రైన్ సెట్, అందులోని ముఘల్ కాలాన్ని పోలిన సెట్ అప్, అలాగే పూజా హెగ్డే ప్రభాస్ ల స్టైలింగ్ చాలా స్పెషల్ గా గ్రాండ్ గా ఉన్నాయి. ఇక నుండి ఇటువంటి రిచ్ విజువల్సే ప్రభాస్ సినిమాలకు సెల్లింగ్ పాయింట్ కానున్నాయి. మిగతా హీరోలకు ఇది సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటే ప్రభాస్ కి ఉన్న మార్కెట్ వారికి ఉండదు.
ఇంతటి బడ్జెట్ కూడా పెట్టలేరు మిగతా సినిమాల మీద. అయితే ఈ మోషన్ పోస్టర్ లోని విజువల్స్ న్యాచురల్ గా అనిపించలేదు. సిజీ సరిగ్గా కుదరలేదా లేక ఉద్దేశపూర్వకంగా అలా చూపించారా అనేది తెలియదు. ఇప్పటికే ఈ సినిమా పీరియడ్ సినిమా అని చెప్పడంతో ఈ విజువల్స్ తో కథ మీద మరింత ఆసక్తి కలిగించారు.
జస్టిన్ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది. బాహుబలి దగ్గర నుండి అన్ని ప్రభాస్ సినిమాల మాదిరి గానే ఇది కూడా వివిధ భాషలలో విడుదల అవుతుంది.
Nitesh Tiwari’s Ramayana, featuring Ranbir Kapoor, Sai Pallavi, Yash, and a big ensemble cast, is…
Two Telugu men were recently attacked in Ossett, UK. The attack came after they were…