
‘యంగ్ రెబల్ స్టార్’ ప్రభాస్ అంటే ప్రస్తుతం ఓ నేషనల్ ఫిగర్. ‘బాహుబలి’ సినిమాతో ఆ రేంజ్ కు చేరిపోయాడు. అంతేకాదు తన తదుపరి సినిమాను కూడా అదే స్థాయిలో మూడు భాషల్లో తెరకెక్కిస్తూ “సాహో” ద్వారా మరో సంచలనానికి శ్రీకారం చుట్టాలని ప్రయత్నిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ పై ఇలా వెలిగిపోతున్న ప్రభాస్, వ్యక్తిగత జీవితంలో కూడా ఓ దశకు చేరుకున్నాడని, ముఖ్యంగా పెళ్లి విషయంలో ఓ క్లారిటీ వచ్చేసిందని, హీరోయిన్ అనుష్కతో వివాహం కానుందన్న పుకార్లు షికార్లు చేసిన సంగతులు పాతవే.
అయితే ఈ అంశంపై స్వయంగా ప్రభాస్ ఎప్పుడూ వివరణ ఇవ్వలేదు. కానీ తాజాగా ఓ మీడియా సంస్థ అడిగిన ఈ ప్రశ్నకు బదులిస్తూ… అనుష్క – తన మధ్య ఎఫైర్ విషయం తన దృష్టికి వచ్చిందని, గత తొమ్మిది సంవత్సరాలుగా తాము కుటుంబ సన్నిహితులుగా మెలుగుతున్నామని, మా మధ్య స్నేహ బంధం ఉందని, అయినా ఇలాంటి అంశాలపై స్పందించకూడదని తాను, అనుష్క నిర్ణయించుకున్నామని, ఓ హీరోయిన్ తో రెండు, మూడు సినిమాలు చేసేస్తే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు.
పెళ్లి అనేది ఎవరి జీవితానికి అయినా చాలా వ్యక్తిగత విషయమని, అలంటి విషయాలు బహిరంగంగా మాట్లాడడం తనకు ఇష్టముండదని, అందులోనూ తనకు చాలా మొహమాటస్తుడినని, తరచుగా ఇలాంటి విషయాలు మీడియా వర్గాలు అడుగుతుండడం తనను ఇబ్బందికి గురి చేస్తోందని చెప్పిన ప్రభాస్, తాను పెళ్లి చేసుకుంటే అందరికీ చెప్పే చేసుకుంటాను తప్ప సీక్రెట్ గా కాదంటూ వివరణ ఇచ్చారు. అంటే.. ఇంతటితో తన పెళ్లిపై వస్తున్న వార్తలకు మీడియా వర్గాలు శుభంకార్డు వేయాలని పరోక్షంగా పెర్కొన్నారన్న మాట.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…