
ఇక అతని నాల్గవ సినిమా… ప్రాజెక్ట్ కె నిన్ననే మొదలయ్యింది. ప్రభాస్ తరువాతి రోజులలో షూటింగ్ మొదలుపెడతాడు. రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేసి… ఆ తరువాత సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె… ఆ వరుస క్రమంలో సినిమాలు షూటింగ్ మొదలెడతాడు.
ఒకప్పుడు బాహుబలి సినిమా రెండు భాగాలకు ఐదేళ్లకు పైగా సమయం తీసుకున్న ప్రభాస్ ఇప్పుడు స్పీడ్ పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ నాలుగు సినిమాలు వరుసగా విడుదల అయిపోతే మంచిదే. అటు ఫ్యాన్స్ కు ఇటు ఇండస్ట్రీకి మంచిదే.
అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. రాధే శ్యామ్ ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభాస్ కష్టపడి నాలుగు సినిమాలు పూర్తి చేసినా విడుదలకు పరిస్థితులు అనుకూలించకపోతే ఇబ్బందే.
ప్రభాస్ తో సినిమా అంటే వందల కోట్ల విషయం.. సినిమా మీద ఖర్చుపెట్టి ఆ సినిమాలు విడుదల చెయ్యకుండా పెట్టుకుని కూర్చోవడం అంటే చాలా నష్టం. వడ్డీల రూపంలోనే భారీ నష్టం తప్పదు. కావున ఇలా నాలుగు సినిమాలు కాకుండా ఒకటి తరువాత ఒకటి చేస్తే మంచిది.
రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలు అంటే పరిస్థితి తెలియక ముందు మొదలుపెట్టారు. ఇప్పుడు కొనసాగించక తప్పదు. అయితే ప్రాజెక్ట్ కె మాత్రం పరిస్థితి పూర్తిగా తెలిసి తీసుకున్న నిర్ణయమే.
India's 2-2 T20I series draw against the West Indies has exposed a concern that the…
Kiran Abbavaram is gearing up for the holiday season with his upcoming family entertainer, Reality.…