
ఈ సినిమా ఆమె మొట్టమొదటి సినిమా. దక్షిణాదిన కూడా ఇదే ఆమె మొదటి సినిమా. ఆమె ప్రాజెక్టులోకి రావడంతో సినిమాకు బాలీవుడ్ లో క్రేజ్ పెరుగుతుంది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ ఈ సినిమాను నిర్మించనున్నారు. నాగ్ అశ్విన్ మహానటి తరువాత చెయ్యబోయే సినిమా ఇదే కావడం విశేషం.
అది వైజయంతి మూవీస్ బ్యానర్ లోనే అత్యంత ఖరీదైన సినిమా. వారు ఈ సినిమాకు ఏకంగా 400 కోట్లు ఖర్చుపెడుతున్నట్టు సమాచారం. అక్టోబర్ లో ముహూర్తం జరగబోతుంది… ఏప్రిల్ 2022లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ మరియు ఇతర ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ ఏడాది నవంబర్ లో ఈ సినిమా మొదలు కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ప్రణాళిక మొత్తం మారిపోయింది. ప్రభాస్ తదుపరి చిత్రం రాధే శ్యామ్ విడుదల వచ్చే ఏడాది మొదటి భాగానికి వాయిదా పడిపోయింది. దీనితో నాగ్ అశ్విన్ మొదలు కావడం ఆలస్యం అవుతుంది. ఎప్పుడు మొదలుపెట్టినా ఏడాది లోగా షూటింగ్ పూర్తి చెయ్యాలని టీం అభిప్రాయం.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో పెను ప్రకంపనలు సృష్టించాయనే చెప్పాలి. తెలంగాణ…
South India has this strong hero worship culture, be it cinema or politics. The kind…