
ఎన్ని చెప్పుకున్నా… అది ‘బాహుబలి’ వరకే పరిమితం. మరి ఆ తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమాలో నటిస్తాడు? అనేది గత కొన్నాళ్ళుగా అభిమానులను వేదిస్తున్న ఓ ప్రశ్న. దీనికి ప్రభాస్ పుట్టినరోజు నాడు సమాధానం లభించింది. 150 కోట్ల బడ్జెట్ తో ప్రభాస్ సన్నిహిత బ్యానర్ అయిన యువీ క్రియేషన్స్ సంస్థ ఓ సినిమాను నిర్మించబోతుందని, దీనికి సుజిత్ దర్శకత్వం వహిస్తారని, లాంచనంగా ఈ సినిమాను డిసెంబర్ లో ప్రారంభిస్తారని ‘ఇండస్ట్రీ హిట్’ అధినేత బిఎ రాజు సమాచారం అందించారు.
థ్రిల్లర్ కధాంశంతో తెరకేక్కే ఒక సాధారణ తెలుగు సినిమాకు 150 కోట్ల బడ్జెట్ అవసరమా? ఒకవేళ పెట్టినా మళ్ళీ అది తిరిగి వస్తుందా? ఇప్పటివరకు ‘బాహుబలి’ మినహా మరే చిత్రం 100 కోట్ల షేర్ ను అందుకోలేకపోయింది. తెలుగు సినిమా మార్కెట్ ఎంతగా పెరిగినా, అది 150 కోట్లను అందుకునేటంత పెరిగిందా? అంటే ప్రశ్నార్ధకమే! మరి రాజు గారు ఇచ్చిన సమాచారం నిజమో కాదో తెలియదు గానీ, సదరు వార్తలు మాత్రం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. అసలే ‘బాహుబలి’ తర్వాత సినిమా అంటే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. అందుకోసం ఓ లో బడ్జెట్ మూవీ చేస్తారని భావించిన సినీ వర్గాలకు ప్రభాస్ షాక్ ఇచ్చినట్లయ్యింది.
మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో పోలిస్తే ప్రభాస్ మార్కెట్ పరిధి కాస్త తక్కువే. ఆయా హీరోలు సూపర్ హిట్లు కొడితేనే 80 కోట్లు రావడం గగనమైపోతోంది. మరి ప్రభాస్ తో 150 కోట్లతో తీసి ఏ విధంగా న్యాయం చేయగలరనేది చిత్ర యూనిట్ కైనా ఓ ప్లాన్ ఉంటే మంచిది. ‘బాహుబలి’ మాదిరి బహుళ భాషల్లో తెరకెక్కించినా, ఒకే ఒక్క సినిమాకు దర్శకత్వం వహించిన సుజిత్ కు మార్కెట్ వర్గాల్లో క్రేజ్ లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ప్రకటన అభిమానులకు ఆనందం కంటే ఉత్కంఠను పెంచింది. ఏది ఏమైతేనేం… ప్రస్తుతం ‘బాహుబలి’ ద్వారా ‘యంగ్ రెబల్ స్టార్’ యుగం నడుస్తోంది… అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు..!
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…