Telugu

రాజమౌళి రిక్వెస్ట్… ససేమిరా కుదరదని చెప్పేసిన ప్రభాస్

మహారాష్ట్ర ప్రభుత్వం థియేటర్లు రీ-ఓపెన్ చెయ్యడానికి వచ్చే నెల 22 నుండి అవకాశం ఇచ్చింది. దానితో బాలీవుడ్ లో ఒక్కసారిగా హడావిడి మొదలయ్యింది. ఏకంగా 2022 చివరి వరకు రిలీజ్ డేట్లు బ్లాక్ చెయ్యడం మొదలుపెట్టారు.

ADVERTISEMENT

ఈ తరుణంలో ఎస్ఎస్ రాజమౌళి మీద ప్రెషర్ పెరిగింది. ఆర్ఆర్ఆర్ డేట్ ప్రకటించాల్సిన పరిస్థితి. ఆలస్యం చేస్తే హిందీలో మంచి డేట్స్ అన్నీ పోయే పరిస్థితి. ఈ తరుణంలో ఆర్ఆర్ఆర్ జనవరి 12న విడుదల అవుతుందని లీకులు ఇస్తుంది చిత్రబృందం.

అయితే ఇప్పటికే ప్రభాస్ రాధే శ్యామ్ జనవరి 14కు ప్రకటింపబడింది. ప్రభాస్ ని కన్విన్స్ చేసి సినిమా వాయిదా వేయించాలని జక్కన్న ప్లాన్ అట. బాహుబలి వంటి భారీ హిట్ ఇచ్చాను కదా ఆ మాత్రం హెల్ప్ చెయ్యడా అనుకున్నాడేమో రాజమౌళి అడిగేశాడట.

రాధేశ్యామ్ మేకర్స్ రాజమౌళికి నో చెప్పేసి… తమ సినిమా ముందుగా ప్రకటించినట్టుగా జనవరి 14నే వస్తుందని క్లారిటీ ఇచ్చేశారు. అలా రిజెక్ట్ చెయ్యడానికి కూడా వెనుక ఒక స్టోరీ ఉందట. ఆర్ఆర్ఆర్ తో గ్యాప్ ఉండాలని రాధే శ్యామ్ టీమ్ మాట్లాడుకునే జనవరి 14 డేట్ ప్రకటించారట.

ఇప్పుడు రాజమౌళి మనసు మార్చుకుంటే తమను ఇబ్బంది పెట్టడమేంటి అనేది వారి వాదన.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Team India’s Weakness: Will NZ Tour Expose It Further?

India's 2-2 T20I series draw against the West Indies has exposed a concern that the…

27 minutes ago

Reality Dasara Special: A Family Celebration

Kiran Abbavaram is gearing up for the holiday season with his upcoming family entertainer, Reality.…

55 minutes ago