
ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ తన తదుపరి చిత్రం ప్లాన్ గురించి బయటపడ్డాడు. “సాహూ తరువాత జాన్ వస్తుంది. ఇప్పటికే 40% షూటింగ్ పూర్తి అయ్యింది. రెగ్యులర్ లవ్ స్టోరీనే అయినా హై క్వాలిటీ విజువల్స్ తో తీస్తున్నాం. తరువాతి సినిమా గురించి ఇప్పటిదాకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. సాహూ చుట్టూ ఉన్న హైప్ బాహుబలి వల్లే అని నాకు బాగా తెలుసు. అందుకే దీనిని తేలికగా తీసుకోదల్చుకోలేదు. సాహూ ఫలితాన్ని బట్టే నా తదుపరి చిత్రం డిసైడ్ అవుతుంది,” అన్నాడు ప్రభాస్
“దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు నా నుండి ఏం కోరుకుంటున్నారో ఈ సినిమా ఫలితం బట్టి తెలుస్తుంది,” అన్నాడు ప్రభాస్. దీని బట్టి బాహుబలి సక్సెస్ తో ప్రభాస్ కళ్ళు నెత్తికి ఎక్కలేదని తెలుస్తుంది. ఇంత భారీ హిట్ వచ్చాకా కూడా ప్రభాస్ రియాలిటీ లోనే ఉండడం మంచి విషయం. ఈ చిత్రం గనుక బాహుబలి స్థాయిలో హిట్ అయితే మనకు మరో జాతీయ స్థాయి సూపర్ స్టార్ దొరికేసినట్టే. బ్రేక్ ఈవెన్ కోసం ఈ సినిమా అన్ని భాషలలో కలిపి 290 కోట్లు రాబట్టాల్సి ఉంది.
రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…
A massive data leak at the Central Board of Film Certification (CBFC) has exposed records…