
అయితే చివరికి అది కార్యరూపం దాల్చకపోవడం, ఆ స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి చేరడం జరిగిపోయాయి. తాజాగా అదే పరిణితి చోప్రా పేరు మరోసారి ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అయితే ఈ సారి మహేష్ బాబు సినిమాకు కాదు, ‘బాహుబలి’తో మాంచి ఊపు మీదున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా కోసం! ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ సినిమా తర్వాత ప్రభాస్ నటించబోయే సినిమాలో పరిణితి చోప్రా కధానాయికగా ఎంపికైందన్న సమాచారం టాలీవుడ్ వర్గాల్లో సందడి చేస్తోంది.
సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ప్రభాస్ స్నేహితులు యువీ క్రియేషన్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో దాదాపుగా 150 కోట్ల భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తోన్న ఈ సినిమా హిందీ మార్కెట్ కోసమని పరిణితి చోప్రాను ఎంపిక చేసినట్లుగా ట్రేడ్ టాక్. మరి గతంలో మహేష్ సినిమా మాదిరి కాకుండా, ఈ సారి పక్కాగా పరిణితి చోప్రా టాలీవుడ్ ఎంట్రీ ఖాయమన్న వార్తలు వినపడుతున్నాయి.
Karthik Subbaraj’s Dorothy has found a new audience after its recent Netflix premiere. Despite receiving…
Artificial intelligence is increasingly entering the film industry, but its first BIG theatrical test in…