
సల్మాన్ ఖాన్ భారత్, అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ రెండు సినిమాలు హాలిడే రోజున విడుదలయ్యాయి. సాహూ మాత్రం పనిదినంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో ఈ ఓపెనింగ్ అనితరసాధ్యమైనది అని చెప్పుకోవాల్సిందే. దీనిబట్టి సినిమా టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ బాలీవుడ్ అభిమానులను థియేటర్లకు రప్పించాడు అనే చెప్పుకోవాలి. చాలా మంది బాలీవుడ్ సూపర్ స్టార్ అయ్యే అవకాశం పోగొట్టుకున్నాడు ప్రభాస్ అని అంటున్నారు.
అయితే ఈ వసూళ్లను బట్టి ప్రభాస్ కు మరో అవకాశం ఉందనే అంటున్నారు సినీ విశ్లేషకులు. ప్రభాస్ తరువాతి సినిమా జాన్ కి కూడా బాలీవుడ్ లో మంచి ఆదరణ వచ్చే అవకాశం ఉంది. అయితే ఆ సినిమా సరిగా ఆడకపోతే మాత్రం ఇబ్బందుల్లో పడినట్టే. ఇప్పటికే ఆ చిత్రం షూటింగ్ 40% పూర్తి అయ్యింది. సాహూ ఇచ్చిన షాక్ నుండి బయటపడి ప్రభాస్ షూటింగ్ మొదలు పెట్టి పూర్తి చెయ్యాలి. గతంలో సంక్రాంతికి వస్తుందని వార్తలు వచ్చినా వేసవి వరకు వచ్చే అవకాశాలు లేవంటున్నారు.
Indian travellers flying through Europe have received major relief after France removed a visa rule…
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…