
సెప్టెంబర్ 28 విడుదల పేరిట భారీ రిలీజ్ ప్లాన్ చేశాడు యూఎస్ డిస్ట్రిబ్యూటర్. ప్రీ-సేల్స్ ఇప్పటికే $500K దాటేశాయి. ఇప్పుడు ఈ వాయిదా వల్ల ఎవరికి నష్టం? రిలీజ్ కి మరీ దగ్గరగా వాయిదా పడకపోవడం ఒకరకంగా యూఎస్ డిస్ట్రిబ్యూటర్ అదృష్టం అనే చెప్పుకోవాలి.
గతంలో ఆర్ఆర్ఆర్ ఇలా వాయిదా పడింది. రిలీజ్ కి మరీ 7-10 రోజులుండగా వాయిదా వేశారు అప్పుడు. అప్పటికే డిస్ట్రిబ్యూటర్ ఆన్ లైన్, ఆఫ్ లైన్ పబ్లిసిటీ మొదలు పెట్టేశాడు. పైగా క్యూబ్ నుండి కంటెంట్ కూడా థియేటర్స్ కి తెప్పించేశాడు.
ఆ కంటెంట్ మళ్ళీ థియేటర్ వైస్ గా డిలీట్ చేయించాల్సి వచ్చింది. మొత్తంగా $250K అదనపు ఖర్చు తేలింది ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూటర్ కి. ఆ లాస్ ని రాజమౌళి సర్దుబాటు చేస్తా అని చెప్పినా అది జరగలేదు. సినిమా పెద్ద హిట్ కావడంతో డిస్ట్రిబ్యూటర్ కూడా పట్టించుకోలేదు.
సలార్ విషయానికి వచ్చేసరికి… ప్రమోషన్స్ మొదలు కాలేదు. కొంత మేర ఆన్ లైన్ పబ్లిసిటీకి ఖర్చు చేసినా పెద్ద విషయం కాదు. గ్రౌండ్ పబ్లిసిటీ స్టార్ట్ చెయ్యకముందే వాయిదా పడటం లక్కీ.
ఇక రెండు సందర్భాలలోనూ లాస్ టిక్కెట్ కొనుకున్న వారికే. టిక్కెట్స్ కి రిఫండ్ వస్తుంది కానీ ప్రతీ టిక్కెట్ మీద ఛార్జ్ చేసే సర్వీస్ ఛార్జ్ అలాగే టాక్సెస్ రిఫండ్ ఇవ్వరు. సో టిక్కెట్ కొన్నవారికి అది నష్టమే.
డిస్ట్రిబ్యూటర్ విషయానికి వస్తే ఈ సారి థియేటర్స్ ఇవ్వడానికి, ప్రీ-సేల్స్ స్టార్ట్ చెయ్యడానికి థియేటర్ చైన్స్ 4-5 సార్లు కంఫర్మ్ చేసుకుని గానీ ఇవ్వవు ఒకరకంగా అదో ఇబ్బందే.
ఇక వాయిదా కారణంగా ఇప్పటికే కట్టిన డబ్బులకు అదనపు వడ్డీ అనేది మాములే. ఇది యూఎస్ డిస్ట్రిబ్యూటర్ కే కాకుండా డబ్బులు కట్టిన ప్రతీ బయర్ కు లాస్ అనే చెప్పుకోవాలి.
The TDP-led alliance has finalised its seat-sharing arrangement for the Andhra Pradesh Local Body Elections.…
Tollywood is spending hundreds of crores on big films, but poor planning is creating a…