
ఒక సినిమా తెరకెక్కించడానికి ఆ చిత్ర దర్శకుడు, చిత్ర యూనిట్ ఎంత శ్రమిస్తుందో తెలియదు కానీ ఒక సినిమా పై సోషల్ మీడియాలో మిమ్స్ సృష్టించే మీమర్స్ కానీ, ఒక సినిమా సన్నివేశాలను మరో సినిమాతో ఎడిట్ చేసే ఎడిటర్స్ కానీ మూవీ విడుదలైన గంటల సమయంలోనే వారి కళాత్మకతను బయటపెడుతుంటారు.
అటువంటి వారి క్రియేటివిటీ చూస్తుంటే ఎవ్వరైనా ఓరా అనాల్సిందే..! తాజాగా రిలీజ్ అయ్యి అటు బాక్స్ ఆఫీస్ ను ఇటు ఓటిటీ ఫ్లాట్ ఫామ్ ను షేక్ చేస్తున్న సలార్ మూవీ పై, అలాగే సంక్రాంతి సూపర్ హీరోగా నిలిచి కలెక్షన్ల తాటతీస్తున్న హనుమాన్ మూవీ పై కలిపి ఎడిట్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
హనుమాన్ మూవీ క్లైమాక్స్ సన్నివేశం లో శ్రీ రాముడికి – హనుమంతునికి మధ్య ఉండే అనుబంధాన్ని వివరిస్తూ విభూషణుడు చెప్పే డైలాగ్స్ కి సలార్ మూవీ లోని దేవా – వరదరాజమన్నార్ మధ్య ఉండే స్నేహాన్నిఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీనితో ఈ వీడియో చూస్తున్నవారంతా మీ టాలెంట్ కి సలాం అంటూ ఈ వీడియో ను వైరల్ చేస్తున్నారు.
త్రేతాయుగంలో రాముడికి నీడయ్యాడు…ద్వాపర యుగంలో కృష్ణార్జునులు రధచేతనమై గర్జించాడు…కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతిఒక్కరి వెంట ఉన్నాడు.. నీ వెంట ఉన్నాడు…అంటూ రఘునందన..రఘురఘునందన అంటూ వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్స్ కు సలార్ మూవీ సన్నివేశాలు చక్కగా సరిపోయాయంటూ ప్రభాస్ అభిమానులు వీడియో రూపొందించినవారికి కృతఙ్ఞతలు తెలియచేస్తున్నారు.
అలాగే గుంటూరు కారం సినిమాలో మహేష్ – శ్రీలీల కుర్చీ మడత పెట్టి పాటను కూడా సూపర్ స్టార్ కృష్ణ సినిమాకు ఎడిట్ చేసి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. దీనికి ఆ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ “క్రేజీ ఎడిట్ పేలింది” అంటూ ఆ వీడియో ను రీట్వీట్ చేసారు. అలాగే గుంటూరుకారం టైటిల్ సాంగ్…అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వీడియోలు.అందుకే సినీ దర్శకుల టాలెంట్ కు ఏమాత్రం తక్కువ కాదు వీరి టాలెంట్ అంటూ జక్కన్నఎప్పుడో వీరి నైపుణ్యానికి కితాబిచ్చారు.
Thalapathy Vijay is one of the biggest names associated with Tamil cinema, and he has…
Vaibhav Sooryavanshi was once again left out of India's playing XI for the fourth T20I…