
డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు నేడు. కనుక మారుతి తప్పకుండా తమ రాజాసాబ్‌కి ఏదో మంచి గిఫ్ట్ ఇస్తారని అభిమానులు ఆతృతగా ఎదురుచూశారు. కాస్త ఆలస్యంగా మోషన్ పోస్టర్ వదిలారు. ఓ అడవిలో దానంతట అదే మ్రోగుతున్న పియానో… తర్వాత లీలగా రాజాసాబ్… కట్ చేస్తే… ఓ పాడుబడిన కోటలో ఒంటరిగా సింహాసనంపై చుట్ట కాల్చుకుంటూ రాజాసాబ్!
బహుశః పెద్ద రాజాసాబ్ అయ్యుండవచ్చు… ఎందుకంటే అంతకు ముందు ఫస్ట్ గ్లిమ్స్‌లో లుంగీ ఎగగట్టి చిలిపిగా నవ్వుతున్న చిన్న రాజాసాబ్‌ని, సూటుబూటు వేసుకొని బైక్ అద్దంలో తన అందాన్ని చూసుకొని తానే మురిసిపోయే చిన్న రాజాసాబ్‌ని మారుతి చూపారు కనుక.
రాజాసాబ్‌లో ప్రభాస్ తండ్రీ కొడుకులుగా డబుల్ రోల్ చేస్తే ప్రేక్షకులకు, అభిమానులకు చాలా సంతోషమే. కానీ ఆరడుగుల అందగాడి పుట్టినరోజునాడు ఇలా ముసలివాడిగా చూపించడం ఏం టైమింగో అర్దం కాదు. ఇదివరకు చూపిన రెండు పోస్టర్లు చూసిన అభిమానులు మన బర్త్ డే బాయ్‌ని మారుతి మరెంత అందంగా అద్భుతంగా చూపిస్తారో అని వారం రోజుల నుంచి చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
అభిమానులు ప్రభాస్‌ని ఏవిదంగా చూడాలనుకుంటున్నారో, ఆయన నుంచి ఏమేమి కోరుకొంటున్నారో అవన్నీ చూపిస్తానని ఈరోజు ఉదయమే దర్శకుడు మారుతి ట్విట్టర్‌లో హామీ ఇచ్చారు. అందరూ రాజసాబ్ కోసం ఎదురు చూస్తుంటే పెద్ద రాజాసాబ్‌ని తీసుకువచ్చి ముందుంచారు. అభిమానులకి మారుతి నిజంగానే హర్రర్ సీన్ చూపించి షాక్ ఇచ్చిన్నట్లనిపిస్తోంది. . పైగా ఈరోజుల్లో హర్రర్ కూడా కామెడీ అయిపోయిందని ముక్తాయించారు. నిజమేనేమో?మరి ప్రభాస్ అభిమానులు ఏమనుకుంటున్నారో… ఓసారి సోషల్ మీడియాలో చూడాలి.
Chiranjeevi's Vishwambhara has been waiting for its theatrical release for a long time. Fans are…
Vijay Deverakonda and Rashmika Mandanna visited Tirumala ahead of Ranabaali's release and offered prayers for…