Telugu

నువ్వొస్తానంటే మేమొద్దంటామా.?

జూన్ 27న “కల్కి 2898 ఏ.డి” తో ప్రేక్షకుల ముందుకి వచ్చి, మరొక 1000 కోట్ల కలక్షన్లను తన ఖాతా లో వేసుకున్నారు రెబెల్ స్టార్ ప్రభాస్. ఆదిపురుష్ వంటి డిసాస్టర్ తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సాలార్ తో తిరిగి గాడి లో పడిన ప్రభాస్, నాగ్ అశ్విన్ చెక్కిన ‘కల్కి’ తో బాక్స్ ఆఫీస్ స్టామినా ను చవిచూపాడు.

ADVERTISEMENT

అయితే ఇంతటి భారీ విజయం తరువాత కూడా ప్రభాస్ మీడియా ముందుకి రాలేదు. సైలెంట్ గా ఫారెన్ వెకేషన్ కు వెళ్లి, తిరిగి వచ్చాక మళ్ళీ షూటింగ్స్ కు తన సమయాన్ని కేటాయించడానికి సిద్ధమయ్యారు ప్రభాస్. నేటి హీరోలు ఒక్కో సినిమా కు రెండు మూడు ఏళ్ళు కేటాయిస్తుంటే, ప్రభాస్ మాత్రం ఒకే సమయం లో రెండు మూడు షూటింగ్స్ లో పాల్గొంటు తన అభిమానులకు వీలైనంత వినోదాన్ని అందిస్తున్నారు.

తన సమయాన్ని అధికంగా షూటింగ్స్ కే కేటాయింస్తూ ఎప్పుడు సెట్ల మీదే తన సమయాన్ని గడువుతున్నారు. ఇప్పటి అగ్ర హీరోలు మహేష్,ఎన్టీఆర్,అల్లు అర్జున్,రామ్ చరణ్ వంటి వారు సైతం కేవలం ఒక్కో సినిమా షూటింగ్స్ కి మాత్రమే డేట్స్ ఏడ్జస్ట్ చేస్తూ ఒక్క సినిమా నే సెట్స్ పై ఉంచారు. ఇటుపక్క పాన్ వరల్డ్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న ప్రభాస్ తన చేతిలో 5 ప్రాజెక్ట్స్ పెట్టుకున్నారు. అయితే వాటిలో ఈ 2024 లో నే 3 సెట్స్ పైకి తెచ్చే ఆలోచనలో ఉన్నారు.

మారుతి దర్శకత్వం లో డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న “రాజాసాబ్” ఈ ఏడాది సంక్రాంతి కి పోస్టర్ రిలీజ్ చేసిన టీం, ఆ తరువాత ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. కల్కి వంటి భారీ విజయం తర్వాత రానున్న సినిమా కాబట్టి మారుతి సైతం ఈ సినిమా పై ప్రత్యేక దృష్టి సారించక తప్పదు. చూడాలి మరి రాజాసాబ్ టీం నుండి వచ్చే తరువాత అప్డేట్ కల్కి ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతుందా? లేదా?

ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వచ్చిన “సలార్-పార్ట్ 1” 2023 డిసెంబర్ లో థియటర్లలోకి వచ్చి, కలక్షన్ల సునామి సృష్టించింది. అయితే, అసలు కథ రెండవ పార్ట్ లో నే ఉందనేలా పార్ట్ 1 క్లైమాక్స్ తో ప్రేక్షకులను పార్ట్ 2 కోసం ఆసక్తి గా ఎదురుచేసేలా చేసారు దర్శకుడు నీల్. సలార్-పార్ట్ 2 షూటింగ్ ఆగష్టు నెల నుండి ప్రారంభం కానున్నట్టు పలు వార్తలు వస్తున్నాయి.

అయితే మరోపక్క “సీత రామం” వంటి క్లాసికల్ సినిమా దర్శకుడు హను రాఘవపూడి, ప్రభాస్ కలిసి ఒక పిరియోడికల్ డ్రామా జోనర్లో మరొక సినిమా ఖాయమంటూ అనేక రిపోర్ట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం 2024 డిసెంబర్ నెల లో ప్రభాస్ ఈ సినిమా సెట్స్ లో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తుంది.

అయితే కేవలం ఈ 3 సినిమాలే కాక, “యానిమల్” సినిమా తో బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్ల మోత మోగించిన క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తో ముందే ప్రకటించిన “స్పిరిట్’ ఇంకా షూటింగ్ ప్రారంభానికి సన్నాహం కాలేదు. అయితే తాజా సినీ సంచలం “కల్కి 2898 ఏ.డి” కు సీక్వెల్ సిరీస్ ఉందంటూ దర్శకుడు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. మరి ఈ సినిమాల షూటింగ్స్ అన్ని ముగించుకుని మళ్ళీ కల్కి సెట్స్ ఎక్కాలి ప్రభాస్.

అయితే ఇలా వరుస సినిమాలతో ప్రభాస్ వస్తానంటే మేమొద్దంటామా అంటూ ప్రభాస్ అభిమనులతో పాటుగా సినీ ప్రేమికులు వేయికళ్లతో ఈ బాహుబలి కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. చూడాలి మరి ఈ సినిమాల షూటింగ్ లన్ని ఎప్పటికి పూర్తవుతాయో? ఎప్పటికి రిలీజ్ అవుతాయో? ఎన్ని బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాస్తాయో?

Share
Manaswini K

Manaswini is a senior writer with extensive experience covering Telugu cinema, as well as the broader Indian film landscape, including Bollywood, Tamil, and other regional industries. With a strong focus on NRI (Non-R…

Published by

Recent Posts

Not Only Rajini, But He Also Can Deliver 500 Cr?

Rajinikanth is going to return to the big screen tomorrow with his new film Jailer…

21 minutes ago

స్థానికంలో మచ్చుకి కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు…

స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల విషయంలో సోషల్ మీడియాలో ఇరు వర్గాల మద్దతుదారులు చేస్తున్న వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా…

42 minutes ago