
స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల విషయంలో సోషల్ మీడియాలో ఇరు వర్గాల మద్దతుదారులు చేస్తున్న వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
జనసేన మద్దతుదారుల వాదనలు: స్థానికంగా బలం పెంచుకోవాలనుకోవడం తప్పా? అందుకోసం మేము సీట్లు అడిగితే తప్పా? ఇంకా ఎంతకాలం మీకోసం మేము త్యాగాలు చేయాలి? టీడీపి నేతలు పైకి మిత్రపక్షం అంటూ చాలా మర్యాదగా మాట్లాడుతుంటారు. కానీ తమ అనుచరులతో మాపై చాలా దారుణంగా పోస్టులు పెట్టిస్తారు. వాటిని సాహించాల్సిన అవసరం మాకేమిటి? అయినా రిజర్వేషన్లు ప్రకటించే ముందు టీడీపి మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం లేదా? మాకు టీడీపి గౌరవం ఇవ్వనప్పుడు దానికి మేమెందుకు ఇవ్వాలి? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
టీడీపి మద్దతుదారుల వాదనలు: జనసైనికులు తమ అధినేత పవన్ కళ్యాణ్ మాటకు గౌరవం ఇవ్వకుండా బహిరంగంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు, చంద్రబాబు నాయుడుని గౌరవిస్తారని ఎలా అనుకోగలం? అయినా టీడీపితో కలిసిన తర్వాతే జనసేన తొలిసారిగా అధికారంలోకి రాగలిగింది? లేకుంటే ఏమయ్యిందో మీకే తెలుసుగా? మీ పార్టీ రాజకీయంగా బలపడి ఎదగాలనుకోవడం తప్పు కాదు. కానీ సీట్ల సర్దుబాటు వ్యవహారం మూడు పార్టీల అంతర్గత వ్యవహారమని తెలిసి ఉన్నప్పుడు దానిపై ఇలా బహిరంగంగా రచ్చరచ్చ చేయడాన్ని ఏవిధంగా సమర్ధించుకుంటారు? అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలోనే ఇంత దూకుడు మంచిది కాదు. అని కొందరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మరో నెటిజన్ అసలు రాష్ట్రంలో 175 స్థానాలలో టీడీపిని ఎలా బలోపేతం చేసుకోవాలని ఆలోచన చేయకుండా అన్నదమ్ముల అనుబంధం, ఆదర్శ కుటుంబం అంటూ సినిమాలు చూపిస్తున్నారంటూ టీడీపికే చురకలు వేశారు.
ఇది సినిమా రిలీజ్.. వాయిదా పడటం గురించి కాదు. మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీ రిలీజ్…
An action sequence for Emraan Hashmi’s upcoming film Gunmaaster G9 reportedly took a scary turn…