
ఒక ఊరిలో జరిగే సంఘటనల సమాహారంగా కనిపిస్తున్న ఈ టీజర్ లో ప్రకాష్ రాజ్ హావభావాలే హైలైట్స్ గా నిలుస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో ఇళయరాజా అందించిన పాట, ఫోర్ గ్రౌండ్ లో ప్రకాష్ అభినయం ఒక వర్గం వారిని ఆకట్టుకునే సినిమాగా కనపడుతోంది. చివర్లో ప్రియమణి వేసిన ‘పెద్ద పార్టీయే’ డైలాగ్ బాగానే పేలింది.
ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన గత రెండు సినిమాలు ఒక దర్శకుడిగా పేరు తెచ్చినప్పటికీ, కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావితం చూపలేకపోయాయి. దీంతో ఈ ‘మన ఊరి రామాయణం’ అయినా కమర్షియల్ సక్సెస్ ని అందిస్తుందో లేదో చూడాలి. అయితే మునుపటి రెండు సినిమాలతో పోలిస్తే… కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాగా కనపడుతోంది.
The motion poster of Chandrayan has been unveiled, giving audiences a glimpse into a wildly…
Chennai Super Kings have been asked to consider a change in captaincy before IPL 2027,…