
బీజేపీ తరపున నిజామాబాదు లో పోటీ చేసిన ధర్మపురి అరవింద్ కోసం వారు పని చేశారట. దాదాపు 20 మంది టీం తో అక్కడ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితను ఓడించడానికి కృషి చేశారట. చివరికి వారి కృషి ఫలించి కవితను ఓడించి అరవింద్ జైంట్ కిల్లర్ గా అవతరించారు. అయితే ఈ విషయం గోప్యంగా ఉంచడం గమనార్హం. కవితను ఓడించడం కేసీఆర్ ను తెలంగాణ గద్దె దించడంలో మొదటి స్టెప్ అని ఢిల్లీ పెద్దలు భావించి ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపారట.
ఈ మధ్య కాలంలో కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని కలవని కారణం కూడా ఇదే. మోడీ ప్రమాణస్వీకారానికి డుమ్మా కొట్టిన కేసీఆర్ ఆ తరువాత నీతి ఆయోగ్ సమావేశానికి కూడా వెళ్ళలేదు. అలాగే నిన్న ఢిల్లీలో అందరి పార్టీ అధినేతల మీటింగుకు కూడా వెళ్ళలేదు. అదీగాక అవును నేను గతంలో మోడీని ఫాసిస్ట్ అన్నాను ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నాను అని కేసీఆర్ మీడియా ముందే కుండబద్దలు కొట్టారు. దీని అంతటికి కారణం కవితను మోడీ పని గట్టుకుని ఓడించడమే అని సమాచారం.
Miloni Jhonsa walks into these frames like she knows the camera is hooked. Draped in…
The saddest part of Javed Akhtar’s post defending Rashmika Mandanna is not his intention, but…