
మీడియాకు కూడా తెలియని ఈ సమాచారాన్ని ఓ వ్యక్తి ఓ ఏడాది కాలం ముందే సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం విశేషం. “కాబోయే రాష్ట్రపతి ఎవరు?” అంటూ 2016లో మీడియాకు చెందిన ఓ వ్యక్తి ట్విట్టర్ లో ముగ్గురు పేర్లు ఆప్షన్స్ గా ఇవ్వగా, ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటే… చెప్పవచ్చు అని ప్రకటించగా… నితిక్ష్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ‘ప్రస్తుతం బీహార్ కు గవర్నర్ గా ఉంటున్న రామ్ నాథ్ కోవింద్’ను చెప్పడం విశేషం. బాగా చదువుకున్న వ్యక్తే కాకుండా, ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉందని పేర్కొన్నాడు.
దీంతో శ్రీవాస్తవ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయాడు. ఒక్కసారిగా ఫాలోయర్స్ సంఖ్య పెరిగిపోయింది. అంతేకాదు, దీనిని ఉద్దేశించి… నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ‘నా భవిష్యత్తు ఎలా ఉంటుంది… ప్లీజ్ చెప్పండి…’ అంటూ ఒకరంటుంటే, ‘మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడితే, వాటినే మేం ఫాలో అవుతాం…’ అంటూ మరికొందరు, ఇలా ఒకటేమిటి ప్రస్తుతం రాష్ట్రపతిగా కోవింద్ పేరు ఎలా మారుమ్రోగుతోందో, అదే స్థాయిలో నితిక్ష్ శ్రీవాస్తవ పేరు కూడా హల్చల్ చేస్తోంది.
Following the failure of Vaa Vaathiyaar, Karthi is now all set to return with his…
Andhra Pradesh chief minister, Chandrababu Naidu has been fully committed and dedicated towards the completion…