
Prem Keetanu teaser sparks backlash
రీమేక్ కల్చర్ అనేది దాదాపుగా అంతమైపోతున్న తరుణమిది. ఓటీటీ కాలంలో రీమేక్స్ అనేవి అప్రస్తుతం. ఎందుకంటే.. అన్నీ భారతీయ పాపులర్ భాషల్లో ప్రతీ ఓటీటీ సంస్థ తాము కొనుక్కున్న సినిమాని డబ్బింగ్ రూపంలో అందుబాటులో ఉంచుతుంది. ఒకవేళ డబ్ చేయకపోయినా జనాలు సబ్ టైటిల్స్ తో చూసేస్తున్నారు.
అందుకే వెంకటేష్, నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్లు వేరే భాషల్లో హిట్ అయిన సినిమాల రీమేక్ లకు చాలా దూరంగా ఉంటున్నారు. మలయాళ, తమిళ సినిమాలు డబ్బింగ్ రూపంలో ఏకకాలంలో రిలీజ్ కి మొగ్గు చూపుతున్నారు.
అయితే.. రీమేక్ అనేది ఒరిజినల్ ని మించి ఉండకపోయినా, కనీసం ఒరిజినల్ సినిమాలోని సోల్ ని కిల్ చేయకుండా ఉంటే చాలు. అదే పెద్ద గౌరవం. కానీ.. బాలీవుడ్ మాత్రం రీమేక్ లతో ఒరిజినల్ సినిమాల్ని నాశనం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లుంది.
ఆల్రెడీ వర్షం, క్షణం, ఖైదీ, బెంగుళూరు డేస్ లాంటి క్లాసిక్స్ ని నాశనం చేసిన బాలీవుడ్ ఇప్పుడు.. న్యూ ఏజ్ క్లాసిక్ గా పేర్కొనే ప్రేమలు సినిమాని నాశనం చేసేందుకు సన్నద్ధంవుతోంది. ఇవాళ ప్రేమలు హిందీ రీమేక్ అయిన “ప్రేమ్ కేతాను” టీజర్ రిలీజ్ చేసారు. నస్లీన్ పాత్రలో వీర్ పహారియా ఏమాత్రం సెట్ అవ్వలేదు. 25 ఏళ్ల లోపు కుర్రాడు చేయాల్సిన పాత్రను 31 ఏళ్ల నటుడితో పోషింపజేస్తే ఇలా ఉంటుంది మరి.
ఈ టీజర్ కి సోషల్ మీడియాలో భీభత్సమైన హేట్రెడ్ వస్తోంది. ముఖ్యంగా క్యాస్టింగ్ విషయంలో. అది సరిపోదన్నట్లు హాట్ స్టార్ లో “ప్రేమలు” సినిమాని అందుబాటులో లేకుండా చేయడం అనేది ఆ కోపాన్ని ఇంకాస్త పెంచింది. మరి బాలీవుడ్ ఈ ఫీడ్ బ్యాక్ ని కాస్త సీరియస్ గా తీసుకుని సినిమాలో కావాల్సిన మార్పులు చేస్తుందా? లేక ఎప్పట్లానే పెడచెవిన పెట్టి మరో మంచి సినిమాని నాశనం చేస్తుందా అనేది చూడాలి.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…