Telugu

మహేష్ బాబు “అదో రకం” స్టార్!

బాల్యంలోనే అనితర సాధ్యమైన నటనను ప్రదర్శించి, సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా వెండితెరపై ‘ప్రిన్స్’గా రంగప్రవేశం చేసి, దినదిన ప్రవర్ధమానంగా ఎదిగిన హీరో మహేష్ బాబు. సినీ బ్యాక్ గ్రౌండ్ నుండి రావడం వల్లనో లేక పరిణితి చెందిన ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్లనో గానీ, ప్రిన్స్ కధలను ఎంపిక చేసుకునే విధానం ఇతర హీరోలకు భిన్నంగా ఉంటుంది.

రెండవ సినిమాతోనే ఓ పిల్లవాడికి తండ్రిగా నటించిన ప్రిన్స్ కెరీర్ లో ప్రయోగాలకు కొదవలేదు. బహుశా ఈ తరం నటుల్లో అత్యధిక ప్రయోగాత్మక సినిమాలలో నటించిన హీరోగా ప్రిన్స్ పేరు నిలిచిపోతుందని చెప్పడంలో సందేహం లేదు. ‘టక్కరిదొంగ, నిజం, నాని, అతడు, ఖలేజా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 1 నేనొక్కడినే, శ్రీమంతుడు’ వంటి వైవిధ్యభరితమైన కధలను ఎంపిక చేసుకోవడం ప్రిన్స్ ఆలోచనల తీరుకు అద్దం పడుతుంది.

ADVERTISEMENT

కేవలం కధను నమ్మి తన ‘స్టార్’ స్టేటస్ ని పక్కన పెట్టడం అనేది ఈ తరం నటుల్లో మహేష్ తోనే మొదలైందని చెప్పడంలో సందేహం లేదు. కృష్ణ లాంటి ఓ మాస్ హీరో వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్, బహుశా ఫక్తు కమర్షియల్ మాస్ సినిమాలు చేసి ఉంటే, ప్రిన్స్ కెరీర్ లో విజయాల శాతం ఎక్కువగా ఉండేవేమో గానీ, రొటీన్ హీరోల మాదిరి మాస్ కు మాత్రమే పరిగణనలోనికి తీసుకోకుండా, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రిన్స్ కెరీర్లో తొలినాళ్ళల్లో తీసుకున్న నిర్ణయాలను విమర్శించిన వాళ్ళు కూడా, ప్రస్తుతం వారి స్వరాన్ని సవరించుకోక తప్పదని నిరూపించారు.

ఇవే ఇతర హీరోల నుండి ప్రిన్స్ ను వేరు చేస్తున్నాయి. అందుకే టాలీవుడ్ స్టార్ హీరోలలో ప్రిన్స్ మహేష్ బాబు “అదో రకం” అని చెప్పకతప్పదు. ఆ ‘అదో రకం’ యాటిట్యూడ్ తో తెలుగు సినిమాను ప్రపంచ పటంలో పెట్టాడు. ప్రిన్స్ సినిమా విడుదల అవుతోంది అంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సందడి, హంగామా ఉంటుందో, అమెరికా వంటి దేశాలలో అంతకు మించిన కోలాహలం నెలకొంటోంది.

జయాపజయాలకు అతీతంగా తన అభిమాన గణాన్ని పెంచుకుంటూ వెళ్ళడమే తెలిసిన ప్రిన్స్, ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మితం కాబోతున్న సినిమాలో నటిస్తున్నాడు. విజయాలతో పాటు కీర్తిప్రతిష్టలు అందరికీ రావు, కానీ, విజయం సంబంధం లేకుండా ఖ్యాతి పెంచుకునే అతికొద్ది మంది నటులలో ప్రిన్స్ ఒకరు. అలా తెలుగు సినిమాను విస్తరిస్తూ మరిన్ని మంచి సినిమాలు చేస్తూ… నిండు నూరేళ్ళు సకల సంతోషాలతో జీవించాలని ఆశిస్తూ… ప్రిన్స్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేద్దాం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Karan Johar Sidelined Regina for Being a South Indian?

The debate over Bollywood actresses' comments on South Indian cinema has taken another turn. After…

42 minutes ago

అయ్యో పాపం చెవిరెడ్డి… పులివర్తి సుధా రెడ్డి ర్యాగింగ్!

నేడు తిరుపతి జిల్లా చంద్రగిరిలో అనూహ్య సంఘటన జరిగింది. పరిషత్ ఎన్నికల్లో దాదాగిరి చేద్దామని వచ్చిన మాజీ మంత్రి చెవిరెడ్డి…

1 hour ago