
హాలీవుడ్ కు వెళ్లిన తరువాత మోతాదు పెంచిన ప్రియాంకా… తాను కేవలం ఒక వ్యక్తి ప్రేమ దగ్గరే ఆగిపోనని, జీవితంలో ప్రతి రిలేషన్ షిప్ కు ఒక ప్రత్యేకత ఉంటుందని, అలాగే ప్రతి రిలేషన్ షిప్ లోనూ కొత్తదనం ఉంటుందని తెలిపింది. అదీ కాక ప్రేమకు హద్దులు లేవని, అందుకే ప్రేమను కొందరు వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయలేమని చెప్పుకొచ్చింది. తన కుటుంబమే తనకు పెద్ద బలం, బలహీనత అని, తాను పబ్లిక్ ఫిగర్ ను కనుక, తన గురించి 90 శాతం విషయాలు ప్రజలకు తెలుస్తుందని, మిగిలిన 10 శాతం తన వ్యక్తిగతమని తెలిపింది.
క్రియేటివ్ పర్సన్స్ తనకు నచ్చుతారని, అలాంటి వాళ్లే జీవితానికి రంగులద్దుతారని అభిప్రాయపడింది. తన కుటుంబం తనకు ఇండివిడ్యువాలిటీ నేర్పిందని, అందుకే తాను ఇండిపెండెంట్ గా ఉంటానని అంది. తనకు పిల్లలతో ఆడుకోవడం అంటే తనకు చాలా ఇష్టమని, వారితో గడిపేందుకే పెద్ద వాళ్లతో మాట్లాడుతానని తెలిపింది. సమాజంలో చోటు చేసుకుంటున్న దారుణాలకు భయపడి ఆడపిల్లలను ఇంట్లోనే ఉంచకూడదని, బయటకు పంపితేనే వారిలో ధైర్యం పెరుగుతుందని, సమస్యలను ఎదుర్కొనే స్థైర్యం అలవడుతుందని పిలుపునిచ్చింది ప్రియాంక.
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…