చిన్న సినిమాలకు కాస్త చోటు ఇవ్వాలి కదా?

తెలుగు సినీ పరిశ్రమకు దిల్‌ (హృదయం) వంటివారు నిర్మాత దిల్‌రాజు. ఆయన మంచి టేస్ట్ ఉన్న నిర్మాత కూడా. అయితే ఆయనలో సినిమాల పట్ల ప్రేమాభిమానాలకు ఆయనలో వ్యాపారి అడ్డుపడుతున్నట్లు కనిపిస్తుంటుంది.

గత ఏడాది సంక్రాంతి పండుగకు వారసుడు (తమిళంలో వారిసు) సినిమా రిలీజ్ విషయంలో ఆయన మొండిగా వ్యవహరించడం అందరికీ తెలుసు. సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు వద్దని వాదించిన ఆయనే వారసుడు రిలీజ్ చేసుకున్నారు.

ADVERTISEMENT

మళ్ళీ ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్‌ సినిమాలకు థియేటర్ల సమస్య ఎదురైనప్పుడు, దిల్‌రాజులోని వ్యాపారస్తుడు బయటకు వచ్చాడు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సంక్రాంతి పండుగ సమయంలో థియేటర్ల కోసం నిర్మాతల మద్య చిన్నచిన్న యుద్ధాలు జరుగుతుంటాయి. అవి చాలా కామన్. సినిమాలో వ్యాపారం కూడా ఉంటుంది కనుక నిర్మాతల మద్య జరిగే ఈ యుద్ధాలను వ్యాపార పరమైన సవాళ్ళుగానే చూడాలి తప్ప నిజంగా వారి మద్య శతృత్వం ఉందనుకోకూడదు.

సినిమా బాగుంటే దానిని ఎవరూ ఆపలేరు. గుంటూరు కారం సినిమా ఫస్ట్ షోకి డివైడ్ టాక్ వచ్చినా మర్నాటి నుంచి పుంజుకొని దూసుకుపోతోంది. మహేష్‌ బాబు అభిమానులు కోరుకొన్నట్లుగా సినిమా ఉంది కనుకనే ఆదరిస్తున్నారు. అయినా మొదట నెగెటివ్ టాక్ వచ్చిన సినిమాలు తర్వాత సూపర్ హిట్ అయినవి ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి కదా?” అని అన్నారు.

తెలంగాణలో కొన్ని థియేటర్లలో హనుమాన్‌ రిలీజ్ చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్‌ ఏడాది కిందటే ఒప్పందాలు చేసుకొంది. కానీ తీరా చేసి హనుమాన్‌ రిలీజ్ చేసే సమయానికి కొందరు థియేటర్లు ఇవ్వలేదు. దీంతో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాతల మండలిని ఆశ్రయించాల్సి వచ్చింది.

హనుమాన్‌ చిన్న సినిమా కనుక పక్కన పడేశారు. అదే… పెద్ద హీరోల పెద్ద సినిమాలకు కూడా అలా చేయగలరా? అంటే కాదనే చెప్పవచ్చు.

థియేటర్ల వ్యవహారంతో దిల్‌రాజుని ఎవరూ తప్పు పట్టలేరు కానీ ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతగా చిన్న సినిమాలకు కూడా తప్పనిసరిగా తగినంత ‘స్పేస్’ ఉండాలని గట్టిగా నొక్కి చెప్పి ఉంటే ఇంకా బాగుండేది.

తెలుగు సినీ పరిశ్రమ మనుగడకు పెద్ద సినిమాలు చాలా అవసరమే కావచ్చు. కానీ బలగం, హనుమాన్‌ వంటి చిన్న సినిమాలు కూడా ఉడతా భక్తిగా తెలుగు సినీ పరిశ్రమ పేరు ప్రతిష్టలు ఆర్జించి పెడుతున్నాయి కదా?

కనుక సినిమాలలో వ్యాపార కోణం ఎంత ముఖ్యమో ‘ప్యాషన్’ కూడా అంతే ముఖ్యం. అప్పుడే తెలుగు సినీ పరిశ్రమకి పరిపూర్ణత లభిస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నా రాజకీయాలతోనే కాలక్షేపం!

ట్రంప్ నిర్ణయాలు, ఇరాన్‌ యుద్ధ పరిణామాలు, హెచ్‌1బీ వీసాలు, గ్రీన్ కార్డుల జారీపై కొత్త ఆంక్షలు.. వీటన్నింటి ప్రభావం అమెరికాతో…

13 minutes ago

వల్లభనేనికి ఇంకా జ్ఞానోదయం అయినట్లు లేదే!

మాజీ వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 5నెలలు జైల్లో ఉండి వచ్చినా ఇంకా జ్ఞానోదయం అయినట్లు లేదు. తన అనుచరులతో…

17 minutes ago