“బాహుబలి 2”లో ‘బాయిలింగ్ స్టార్’ బబ్లూ!

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీదే హవా! ఏ సినిమాలో అయినా ఈ ‘బాయిలింగ్ స్టార్’ బబ్లూ కోసం డైరెక్టర్లు, రచయితలు ప్రత్యేక పాత్రలు సృష్టిస్తున్నారు. దీనికి దర్శకధీరుడు రాజమౌళి సైతం మినహాయింపు కాదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇండియన్ చిత్ర పరిశ్రమ ఎదురు చూస్తున్న ప్రతిష్టాత్మక సినిమా “బాహుబలి 2” కోసం ఈ ‘బాయిలింగ్ స్టార్’ను ఎంపిక చేసినట్లుగా ఫిలింనగర్ వర్గాల టాక్. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్న పృథ్వీ, రాజమౌళిని సైతం ఫ్లాట్ చేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు. “లౌక్యం”లో ‘బాయిలింగ్ స్టార్ బబ్లూ’ మొదలుకొని “భలే మంచి రోజు”లో ‘మల్లెపుష్పం’ వరకు పృథ్వీ చేసిన కామెడీ విమర్శకులను కూడా మెప్పించింది.

“బాహుబలి” మొదటి పార్ట్ లో కామెడీ లేదని కాస్త నిరుత్సాహపడ్డ ప్రేక్షకుల కోసం సెకండ్ పార్ట్ లో పృథ్వీని ఎంపిక చేసి ఉంటారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలను అధికారికంగా జక్కన్న ధృవీకరించే వరకు నమ్మలేనివి. ఎందుకంటే, ‘బాహుబలి’ సినిమా షూటింగ్ సందర్భంలో కూడా అనేక మంది ప్రముఖుల పేర్లు వినపడ్డాయి. ఆ సమయంలో ఒక్కొక్కటిగా రాజమౌళి ఖండిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే పృథ్వీ ఎంపిక నిజమైతే మాత్రం ‘బాయిలింగ్ స్టార్’ కెరీర్ తో పాటు, ‘బాహుబలి – ది కంక్లుజన్’కు కూడా దోహదమయ్యే అంశమే!

Share
Published by

Recent Posts

కేసీఆర్ పాదయాత్ర…ఏపీ రాజకీయాలను కూడా ప్రభావితం చెయ్యగలదా.?

కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్…

17 minutes ago

Telangana Assembly Battle Ground: Protests & Injuries

Telangana Assembly sessions are rarely short of political drama, but today’s developments have taken the…

19 minutes ago