
అయితే తాజాగా బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయిన రాజశేఖర్ “పీఎస్వీ గరుడవేగ” సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం రచ్చ జరగడం లేదు. గొడవలు పడేటంత ఫ్యాన్స్ గానీ, అలాగే గొడవలు పెట్టుకునేటంత అభిమానగణం గానీ లేకపోవడం రాజశేఖర్ కు కలిసి వచ్చిన అంశం. అయితే అన్నింటి కంటే ముఖ్యంగా ఎలాంటి వివాదాలు రాకపోవడానికి ప్రధాన కారణం… ఈ సినిమాకు సినీ ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వ్యక్తం కావడం.
అవును… పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ విషయంలో ఎలాంటి వివాదాలకు అవకాశం లేకుండా పోయింది. అదే పెద్ద హీరోల సినిమాలకు అయితే ఓ పక్కన పాజిటివ్ టాక్ లేకపోవడం, మరో పక్కన రికార్డులు బద్దలు కొట్టే కలెక్షన్స్ పోస్టర్స్ లో దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ మధ్య కొట్లాటలు ఎక్కువవుతున్నాయి. దీంతో రికార్డులు పగలకోట్టేయాలి అన్న దృక్పధంతో కాకుండా, సరైన కధల మీద దృష్టి పెడితే ఆటోమేటిక్ గా కలెక్షన్స్ వాటంతట అవే వస్తాయ్!
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…