Telugu

పులివెందులలో ఓట్ల పోరా.. హింసా రాజకీయమా?

దశాబ్దాలుగా వైఎస్‌ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో టీడీపీ చరిత్ర సృష్టించింది. మొత్తం 40 వార్డుల్లో 20 వార్డులను ఏకగ్రీవంగా దక్కించుకుని, వైసీపీకి గట్టి సవాల్‌ విసిరింది. ఇక్కడ టీడీపీకి ఇన్ని వార్డులు ఏకగ్రీవం కావడం ఇదే తొలిసారి. మున్సిపాలిటీపై తొలిసారి జెండా ఎగరేయాలన్న పార్టీ లక్ష్యానికి ఈ ఫలితం పెద్ద ఊపునిచ్చింది.

ఒకప్పుడు అభ్యర్థులను నిలబెట్టడమే టీడీపీకి కష్టంగా ఉన్న ప్రాంతంలో, ఇప్పుడు సగం వార్డులు ఆ పార్టీ ఖాతాలో చేరడం చిన్న విషయం కాదు. వైఎస్‌ కుటుంబం నిలబెట్టినవారే గెలుస్తారన్న పరిస్థితి నుంచి, ఆ కుటుంబమే గెలుపు కోసం శ్రమించాల్సిన పరిస్థితికి పోటీ చేరింది. స్వయంగా జగన్‌ రంగంలోకి దిగి పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తుండటం ఈసారి ఎదురవుతున్న సవాల్‌కు అద్దం పడుతోంది.

ADVERTISEMENT

ఛైర్‌పర్సన్‌ స్థానానికి టీడీపీ ఎంచుకున్న అభ్యర్థి కూడా పోటీని ఆసక్తికరంగా మార్చారు. వైసీపీ నుంచి జగన్‌ చిన్నాన్న వైఎస్‌ మనోహరరెడ్డి భార్య ప్రమీల పోటీ చేస్తుండగా, టీడీపీ తూగుట్ల మధుసూదన్‌రెడ్డి భార్య గీతాకుమారిని బరిలోకి దించింది. పట్టణంలో తూగుట్ల కుటుంబానికి ఉన్న పరిచయాలు, స్థానిక సమస్యల పరిష్కారానికి మధుసూదన్‌రెడ్డి చొరవ చూపిస్తారన్న పేరు టీడీపీకి అదనపు బలం.

ఏకగ్రీవాలతో వచ్చిన ఊపునకు వైసీపీ నుంచి చేరికలు కూడా తోడయ్యాయి. గతంలో పెద్దగా ప్రాతినిధ్యం లేని వార్డుల్లోనూ టీడీపీ బలం పెంచుకుంటోంది. మరోవైపు జగన్‌, బీటెక్‌ రవి మధ్య సవాళ్లతో ప్రచారం వేడెక్కింది. జగన్‌ వ్యాఖ్యలు హింసను రెచ్చగొట్టేలా ఉన్నాయని మంత్రి సత్యకుమార్‌ ఆరోపించగా, తమకు అభ్యర్థులు దొరక్కపోవడానికి టీడీపీని నిందించడం ఏమిటని బీటెక్‌ రవి ప్రశ్నించారు.

ఛైర్‌పర్సన్‌ పీఠంపై తుది తీర్పు ఇంకా రావాల్సి ఉన్నా, పులివెందులలో టీడీపీ ఇప్పటికే తన రాజకీయ ఉనికిని బలంగా చాటుకుంది. సగం వార్డులను ఏకగ్రీవంగా దక్కించుకోవడం పార్టీకి భారీ ముందడుగు. ఇప్పుడు ఈ ఊపును మిగిలిన వార్డుల్లోనూ కొనసాగించి, వైఎస్‌ కుటుంబం కంచుకోటలో తొలిసారి మున్సిపల్‌ పీఠాన్ని దక్కించుకోవడంపై టీడీపీ దృష్టి పెట్టింది.

Share
Chaitanya Krishna

I’m passionate about Telugu cinema, but I also enjoy watching films in other languages, especially Malayalam and Tamil. I love offering critical yet meaningful analysis of movies.

Published by

Recent Posts

NTR Must Bring Rajamouli For Trivikram?

There is no director in Indian cinema, who is as capable as Rajamouli when it…

13 minutes ago

ట్రంప్‌కు నోబెల్ కాదు.. ఆస్కార్ ఇవ్వాలేమో?

డొనాల్డ్ ట్రంప్‌ ఏం చెప్పారు? తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే పది రోజుల్లోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నిలిపివేయించేస్తానని చెప్పారు. పది…

14 minutes ago