
దీంతో సమాధానం చెప్పేందుకు ప్రయత్నించిన పల్సర్ సునీ…‘‘నేను దొంగని కదా? ఒక దొంగ చెప్పే విషయాల్ని ఎందుకు వింటున్నారు?’’ అంటూ ఎదురు ప్రశ్నించాడు. తరువాత ‘‘మా మేడమ్ కావ్య. ఈ విషయం ఇదివరకు మీకు చెప్పలేదా?’’ అని అడిగాడు. దీంతో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్టైంది. ఈ దారుణానికి పాల్పడమని పురమాయించింది హీరో దిలీపేనన్న విషయం కూడా దాదాపుగా స్పష్టత వచ్చేసినట్లే. సినీ ఇండస్ట్రీకి చెందిన దిలీప్ – కావ్యా మాధవన్ లు కలిసి ఈ కుట్రకు పాల్పడడం అత్యంత శోచనీయం.
గతంలో తనకు పల్సర్ సునీ ఎవరో తెలియదని కావ్యామాధవన్ వ్యాఖ్యానించిన తరువాత, ఆమె వద్ద పల్సర్ సునీ డ్రైవర్ గా పని చేశాడన్న సమాచారం బయటకు వచ్చింది. ఆ తరువాత పల్సర్ సునీకి 25,000 ఇచ్చానని దిలీప్ చెప్పడన్న సంగతి పోలీసు విచారణలో తేలింది. గతంలో మేడమ్ తనకు డబ్బులిచ్చారని, అయితే అప్పుడు ఆమెకు డబ్బులిస్తోంది… భావనపై దాడి కోసం ఇస్తున్నట్టన్న సంగతి తెలియదని పల్సర్ సునీ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పల్సర్ సునీ చేసిన వ్యాఖ్యలు ఈ కుట్ర కేసులో రహస్యం వెలుగులోకి తెచ్చింది.
Kalki 2898 AD changed the game for Prabhas. After films like Saaho, Radhe Shyam, and…
Kichcha Sudeepa needs no special introduction to the Telugu audiences. The actor’s next project has…