
ఐపీఎల్, ఈ లీగ్ పేరు వింటే అభిమానులకు తొలుత గుర్తుకువచ్చేది నువ్వా-నేనా అనే రేంజ్ లో తలపడే మ్యాచ్లు, కలలో ఊహించని ట్విస్టులు, సీజన్ సగానికి టేబుల్ లో చివరి స్థానంలో ఉన్న జట్టు లీగ్ పూర్తయ్యేప్పటికీ ప్లే-ఆఫ్స్ కు అర్హత సాధించటం. ఇలా, ఈ లీగ్ ఇలాంటి ‘కుడియడమైతే’ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడుతుంది.
పంజాబ్ కింగ్స్, సీజన్ తొలి సగం మ్యాచ్లు పూర్తయ్యేపాటికి ఈ జట్టు 7 మ్యాచ్లు ఆడితే, ఓటమి అనేది చవిచూడకుండా వరుసగా 6 మ్యాచ్లను గెలిచి చరిత్ర తిరగరాసే జైత్రయాత్ర కొనసాగించారు. ఐపీఎల్ 2008 లో మొదలయినప్పటినుండి ఈ ఫ్రాంచైజ్ కు ఒక్క ట్రోఫీ కూడా లేదు, ఆ ట్రోఫీ కరువును ఈ సీజన్ ఎలా అయినా తీర్చేస్తారు అని అనుకున్నారు పంజాబ్ ఫాన్స్.
కానీ, ఐపీఎల్ అంటేనే ఎవ్వరు ఊహించని మలుపులు. సీజన్ సగానికి 13 పాయింట్లతో కేవలం ఇంకొక్క విజయం సొంతం చేసుకుంటే ప్లే-ఆఫ్స్ కు అర్హత సాధించే స్థాయి నుండి ఇప్పుడు మిగిలిన 2 మ్యాచ్లకు రెండింటిలోనూ కచ్చితంగా గెలవాల్సిందే అనే స్థాయికి దిగింది పంజాబ్ జట్టు.
సీజన్ సగం తరువాత 5 మ్యాచ్లు ఆడిన పంజాబ్, ఒక్క మ్యాచ్లో కూడా గెలుపు సాధించకపోవటం ఇంకా అభిమానులకు ఇంకా అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది. 7 మ్యాచ్లు పూర్తయినప్పడు 13 పాయింట్లతో ఉన్న పంజాబ్, 12 మ్యాచ్లు పూర్తయేసరికి కూడా 13 పాయింట్ల వద్దే ఉన్నారు.
తొలి భాగంలో పంజాబ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా అభిమానులను అలరించటంలో అస్సలు తగ్గలేదు. తమ అపోజిషన్ జట్ల పై, ఇంకా లీగ్ లో మిగతా జట్ల పై మరియు తమ ఓటమి ఎరుగని జైత్రయాత్ర పై రోజు ఏదొక పోస్ట్ పెడుతూనే వచ్చారు ఈ ఫ్రాంచైజ్ హ్యాండిల్.
కానీ, లీగ్ స్టేజిలో తమ 8వ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు పై ఆడిన మ్యాచ్ నుండి, పంజాబ్ మళ్ళీ గాడిన పడలేదు. ముందు ఆడిన 7 మ్యాచ్లలో 6 మ్యాచ్లు, పంజాబ్ టార్గెట్ ను ఛేదించి విజయాలు సాధించింది. ఇదే తమ సమస్య అని గ్రహించిన రాజస్థాన్ ఆ మ్యాచ్లో టాస్ గెలిచి ముందు పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించారు.
ఇక అప్పటినుండి ఇపటివరుకు, వరుసగా ఓడిన 5 మ్యాచ్లలోను పంజాబ్ మొదటిగా బ్యాటింగ్ చేసి టార్గెట్ ను డిఫెండ్ చేసుకోలేక ఓడిపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే జట్టు కనీసం ప్లే-ఆఫ్స్ కు అర్హత సాదించకుండానే ఇంటి దారి పట్టక తప్పదు. ఈ విషయమై ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హాడిన్ మేము మ్యాచ్లను గెలిచే విధానం కనుక్కోవాలంటూ చెప్పుకొచ్చారు.
లీగ్ స్టేజి మొదటి 7 మ్యాచ్లలో ఒక్క మ్యాచ్ కూడా ఓటమి పాలుకాకుండా, ఇప్పుడు వరుసగా 5 మ్యాచ్లు పరాజితులవటం ప్రస్తుతం ఆ జట్టు అభిమానులను అయోమయంలో పడేసింది. తమ ఫీల్డింగ్ ఏ తమకు మ్యాచ్లను దూరం చేస్తుంది అని గ్రహించిన పంజాబ్ జట్టు కం-బ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. మరి ఆదివారం మంచి ఫామ్ లో ఉన్న ఆర్.సి.బీ జట్టు ను పంజాబ్ ఢీకొనబోతుంది.. ఈ మ్యాచ్లో అయినా పంజాబ్ విజయబాట పడుతుందా..?
“Chi deenamma… akkada vaalaki Dorothylu, Baththalu, Modha Rathrilu, Bethalahem Kudumba Unit lu. Manakemo Peddilu, Paradiselu,…
The team of Megastar Chiranjeevi’s actioner Kaaka, directed by Bobby Kolli and produced by Venkat…