
అయితే ఆ బాధ్యతను దర్శకుడు పూరీ తీసుకున్నట్లుగా కనపడుతున్నారు. ఎందుకంటే… తాజాగా విడుదల చేసిన “ఇజం” పోస్టర్స్ లో నందమూరి కళ్యాణ్ రామ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ కళ్యాణ్ రామ్ వైరెటీ లుక్ ఇప్పటికే ప్రేక్షకుల్లోకి వెళ్లి, పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకోవడంతో, ఈ సినిమా హిట్టయితే కళ్యాణ్ రామ్ కు భారీ బ్రేక్ లభించినట్లేనన్న టాక్ సినీ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. ఒక రకంగా కళ్యాణ్ రామ్ కెరీర్ కు అత్యంత కీలకమైన సినిమాగా ఈ “ఇజం”ను పేర్కొంటున్నారు.
మరి ముంచుతాడో, పైకి లేపుతాడో అంతా పూరీ చేతుల్లోనే ఉంది. అయితే ఎలాంటి అంచనాలు లేని సమయంలో మాత్రం పూరీ ఓ రేంజ్ లో ప్రేక్షకుల మనసు దోచేస్తాడు. ఇదే సమయంలో, ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం అదే స్థాయిలో నిరాశపరిచిన సందర్భాలు ఉన్నాయి. ఇందుకు ఉదాహరణే… వరుణ్ తేజ్ తో తీసిన “లోఫర్.” అప్పటివరకు సజావుగా సాగుతున్న వరుణ్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా ‘లోఫర్’ నిలిచి, వరుణ్ కెరీర్ ను డౌన్ చేసింది. దీంతో కళ్యాణ్ రామ్ ను ఏ దారిలోకి తీసుకువస్తారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…