
మెగా స్టార్ హీరోగా, మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రం శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుంటుంది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు ‘సల్మాన్ ఖాన్’ ఓ కీల పాత్రలో నటించబోతున్నారు. ఇటీవలే సల్మాన్ ఈ సినిమాకు సంబంధిన తన షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నారు.
ఇపుడు తాజాగా పూరి ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర చేబోతున్నారని చెప్పి చిరు సినిమా పై ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతున్నారు.పూరి ఎంతగానో అభిమానించే నటుడు మెగాస్టార్ చిరంజీవి. అయన తో ఓ మాస్ చిత్రం డైరెక్ట్ చేయడానికి చూసిన పూరి కొన్ని కారణాల వలన దాన్ని పక్కనపెట్టారు. అయితే ఇప్పుడు చిరు తో కలసి నటించే అవకాశం రావడంతో పూరి ఆ బాధను మరిచిపోతారేమో చూడాలి.
గాడ్ ఫాదర్ సెట్స్ లో చిరుని కలిసిన పూరి పిక్ ని చిరు ఆ పోస్టుకి జత చేసి అభిమానులతో పంచుకున్నారు. తనకు అచ్చొచ్చిన ‘ఖైదీ’ డ్రెస్సులో ఫ్లవర్ బొకే ఇస్తూ చిరు, గ్లాస్సెస్ పెట్టుకుని క్లాసీ లుక్ లో పూరి ‘గాడ్ ఫాదర్’ కి మరింత క్రెజ్ తీసుకొస్తున్నారు. ఇలా చిరు తన సినిమాలో పూరికి నటనకు అవకాశమిచ్చి తన కల నెరవేర్చబోతున్నారు. అందుకే చిరు టాలీవూడ్ “అన్నయ్య” అయ్యారంటూ మెగా ఫాన్స్ ఆనందంలో మునిగిపోయారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత కాస్టలీ అనేది నేటి రాజకీయ నాయకులు లెక్కలతో సహా వివరిస్తున్నారు. ఏపీలో జరుగుతున్న స్థానిక…
Nani seems to be taking a cautious approach with Bloody Romeo after his experience with…