
అయితే ఇటీవలే విడుదలైన ట్రైలర్ లో పూరి తన పైత్యం మరోసారి చుపించాడంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ తరుణంలో సినిమాను కొనడానికి బయర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇది అలా ఉండగా కాసేపటి క్రితం ఈ సినిమా సెన్సార్ పూర్తి అయ్యింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. సహజంగా ఏ సినిమా టీం కూడా ఏ సర్టిఫికెట్ ను ఆహ్వానించదు. కోరుకోదు. అయితే పూరి టీం మాత్రం పండగ చేసుకుంటుంది. కారణం గతంలో ఉన్న హిట్ సెంటిమెంట్ అట.
గతంలో పూరి కేరీర్ లో బ్లాక్ బస్టరైన పోకిరి, దేశముదురు, బిజినెస్ మాన్ సినిమాలకు కూడా ఏ సర్టిఫికెట్లే రావడంతో అదే సెంటిమెంట్ ప్రకారంతో ఇస్మార్ట్ శంకర్ కూడా పెద్ద హిట్ అవుతుందని పూరి భావిస్తున్నాడు. చూడాలి ఏం అవ్వబోతుందో. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్, ఛార్మిలు సంయుక్తంగా ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.
Director Karthik Subbaraj's indie film Dorothy starring Sananth and Rishikanth in the lead roles was…
రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…