మరో ‘బాంబు’ పేల్చిన పూరీ!

సినిమా ప్రారంభం ఎప్పుడో చెప్పలేదు గానీ, సినిమాను ఎప్పుడు విడుదల చేయాలనుకుంటున్నారో చెప్పేసారు. టాలీవుడ్ లో ఇంతటి డేర్ పూరీకి తప్ప ఎవరికీ ఉండదన్న విషయం తెలిసిందే. అలాంటి పూరీ తన తదుపరి చిత్రం గురించి చెప్తూ తెలుగు, కన్నడ భాషల్లో “రోగ్” చిత్రాన్ని తీయనున్నానని, ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, 2016 ఏప్రిల్ లో సినిమా విడుదల అవుతుందని చెప్పారు.
ఇక, అసలు ఆసక్తికరమైన అంశమేమిటంటే, ప్రిన్స్ మహేష్ బాబు కాంభినేషన్ లో మరో చిత్రం చేస్తున్నానని, ఈ స్క్రిప్ట్ సిద్ధమవుతోందని, వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని అన్నారు. అయితే, ఈ సినిమాకు సంబంధించి ట్రేడ్ వర్గాల్లో మరో వార్త హల్చల్ చేస్తోంది. మహేష్ తో తీయబోయే చిత్రం మల్టీ స్టారర్ అని, ఇప్పటికే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ప్రస్తుతం రెండవ హీరో కోసం ప్రస్తుతం పూరీ అన్వేషిస్తున్నారని తెలుస్తోంది.
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రాలన్నీ క్లాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకుని రాగా, పూరీ మాత్రం పక్కా మాస్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. అయితే, ప్రిన్స్ ప్రస్తుతం చేస్తున్న “బ్రహ్మోత్సవం” తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో నటించే చిత్రాన్ని ఏప్రిల్ లో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ చిత్రం పూర్తవ్వడానికి కనీసం మరో ఆరు మాసాలు పడుతుంది. దీంతో వచ్చే ఏడాది ముగింపు సమయానికి గానీ పూరీ చిత్రం ప్రారంభానికి నోచుకోదని సినీ విశ్లేషకుల అంచనా.

Share
Published by

Recent Posts

RGV’s Scary AI Take: What Will Humans Do Next?

Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…

8 minutes ago

గీతలు దాటుతున్న రాజకీయ భాష…పాపం ఎవరిదీ.?

రాజకీయాలలో నానాటికి విలువలు దిగజారుతున్నాయని ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు తమ చేష్టలతో, తమ చర్యలతో నిరూపిస్తూనే వస్తున్నారు. నిన్న మొన్నటి…

28 minutes ago