
ఇప్పుడు ఈ ‘బాబు’ రేంజ్ ఎంతదాకా వెళ్లిందంటే… మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీస్తున్న పూరీ జగన్నాధ్ కూడా ఈ ‘బాబు’తో పనిచేయాలని ఉందన్న స్థాయికి వెళ్ళాడు. అవును… స్వయంగా పూరీ జగన్నాధ్ ఈ వ్యాఖ్యలు చేసారు. ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబు అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన పూరీ, చాలాసార్లు సంపూతో కలిసి పని చేయాలని ప్రయత్నించానని, కానీ కుదరలేదని, భవిష్యత్తులో తప్పకుండా సంపూతో పనిచేస్తానని అన్నారు.
మీరు చదువుతున్న ఈ వ్యాఖ్యలు నిజమే. స్వయంగా పూరీనే ఇలా అన్నారు. అందులో మరో ఆలోచనకు ఆస్కారం లేదు. ఇటీవల ‘కొబ్బరిమట్ట’ సినిమాలోని మొదటి పాటను విడుదల చేసిన సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలివి. ఈ మాటలతో ‘కొబ్బరిమట్ట’ ఒక ఏడాది ఆడినంత ఆనందం సంపూకు దక్కి ఉండవచ్చు. పూరీతో చేయాలన్న అభిలాషను సంపూ వ్యక్తపరచవచ్చు గానీ, సంపూతో చేయాలని పూరీ చెప్పడమేంటి? అంటూ అవాక్కవ్వడం సినీ వర్గీయుల వంతు కాగా… ఎంతైనా వర్మ శిష్యుడు కదా… అని సరిపెట్టుకుంటున్నారు.
Prabhas fans may finally start getting more updates about Fauzi from this month. Mythri Naveen…
After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…