Telugu

ఇలా కొట్టేవారెవరైనా ఉన్నారా..మళ్ళీ ఆయనే ట్రై చెయ్యాలా..?

రీసెంట్ టాలీవుడ్ సెన్సేషన్ కల్కి-2898 ఏ.డి, బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామి నే సృష్టిస్తుంది. కేవలం 16 రోజుల్లోనే 1000 కోట్ల గ్రాస్ ను అందుకుని, తన కెరీర్ లో రెండవ వెయ్యి కోట్ల సినిమా తో ఇండియా నే షేక్ చేస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. షారుఖ్ తర్వాత రెండు వెయ్యి కోట్ల సినిమాలు ఉన్న స్టార్ గ నిలిచారు ప్రభాస్.

అయితే నాగ్ అశ్విన్ సృష్టించిన ఈ సునామి ఇప్ప్పుడప్పుడే సద్దుమణిగేలా కనిపించటం లేదు. ఆ తరువాత వచ్చే పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు ‘కల్కి’ భారీ స్థాయి లో ప్రభావిత చేయనుంది అనటంలో ఎటువంటి సంకోచం లేదు. సెట్స్ పై ఉన్న ‘దేవర’, చివరి షెడ్యూల్ కు వచ్చిన ‘గేమ్ చెంజర్’ , అల్లు అర్జున్ ‘పుష్ప-2 ‘ విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ADVERTISEMENT

తొలుత ఏప్రిల్ 5 ను విడుదల కావాల్సిన ‘దేవర’ , కొన్ని కారణాల వలన విడుదల తేదీని పోస్టుపోన్ చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. అయితే ఆంధ్రా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ‘ఓజి’ సెప్టెంబర్ 27 న విడుదల కావాల్సి ఉండగా, షూటింగ్ సమస్యల వలన పోస్టుపోన్ చేసుకున్నారు. అయితే ఆ డేట్ కు రానున్న ‘దేవర’ ప్రేక్షకులను ఏ మేరకు సంతృప్తి పరుస్తుందోనని చూడాలి.

అంతేకాక, టాలీవుడ్ లో రాజమౌళి తో పని చేసిన హీరో,అతని తరువాత సినిమా ప్లాప్ అవ్వటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. తాజాగా జక్కన్న తీసిన ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత చరణ్ ‘ఆచార్య’ లో భాగం కాగా,ఆ చిత్రం సైతం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచి రాజమౌళి సెంటిమెంట్ ముందు తలవంచింది.

‘ఆచార్య’ ను తెరకెక్కించిన దర్శకుడు కొరటాల శివ,రామ్ చరణ్ తో జతకట్టి, రాజమౌళి సెంటిమెంట్ కు చిక్కారు. చూడాలి మరి, అదే దర్శకుడు ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో తెరకెక్కిస్తున్న ‘దేవర’ తో నైనా ఈ ఆనవాయితీ ని అధిగమిస్తారా అనేది..?కల్కి 2898 ఏ.డి తరువాత వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘ఇండియన్-2 ‘ , ప్రేక్షకులను అలరించటం లో పూర్తిగా విఫలం అయింది.

మరి అదే దర్శకుడు శంకర్, రామ్ చరణ్ తో సెట్స్ పై ఉన్న ‘గేమ్ చెంజర్’ తో మళ్ళీ ఫామ్ లో కి వస్తారా అని. శంకర్ చేసిన గత రెండు సినిమాలు పాత శంకర్ తీరు లో లేక, బాక్స్ ఆఫీస్ వద్ద నెగటివ్ రిజల్ట్స్ సంపాదించాయి. రోబో 2 .0 మరియు ఐ వంటి సినిమాలు నిరాశ పరిచినా,ఇండియన్-2 తో ఫామ్ లోకి వస్తారనుకున్నారు. మరి ఈ నెగటివిటీ తో ‘గేమ్ చెంజర్’ పాజిటివ్ టాక్ సంపాదిస్తుదా?

అయితే ఐకాన్ స్టార్ మరియు సుకుమార్ కలయికలో వస్తున్న ‘పుష్ప-2 ‘ , తొలుత ఆగష్టు 15 ను విడుదల తేదీగా ప్రకటించారు. అయితే ఏపీ రాజకీయాలలో వైసీపీ కి మద్దతుగా అల్లు ఎంట్రీ ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అల్లు అర్జున్ పై, ఎలెక్షన్ల రిజల్ట్స్ తరువాత భారీ స్థాయి లో నెగటివిటీ మరియు ట్రోలింగ్ చోటు చేసుకున్న తరుణంలో ఇక ఈ నెగటివిటీ మధ్య పాన్ ఇండియా రిలీజ్ ను పోస్టుపోన్ చేసుకుంది చిత్ర యూనిట్.

మరి రిలీజ్ సమయానికి అయిన ఇదంతా సద్దుమణిగి,ప్రేక్షకులు సినిమా ను ఆదరిస్తారో లేదో అని చూడాలి. ఇలా విడుదలకు సిద్ధంగా ఉన్న ఒక్కో పాన్ ఇండియా మూవీకి ఒక్కో అడ్డంకి టార్గెట్ కు ఎదురుగా నిలిచి ఉంది. అలాగే ఈ సినిమాల మీద అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. మరి వచ్చే సినిమాలు వాటిని అందుకుని నిలబడతాయా, లేదా మళ్ళీ ‘స్పిరిట్’,’సలార్-2 ‘ లేదా కల్కి సిరీస్ తో ప్రభాస్ ఏ ఈ లెక్కలను సరిచేస్తారో చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Daily Hearing At CBI Court, But Can Jagan Stay Out?

It has been more than dedicate since the CBI and the enforcement directorate have failed,…

3 minutes ago

వివేకా హత్య కేసులో సీబీఐ కంటే ఈడీ స్పీడ్‌!

“వివేకా హత్య కేసుతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఆ ఆరోపణలతో నేను చాలా ఆవేదన అనుభవిస్తున్నాను. నేను ఏ…

7 minutes ago